// // Agniveer Vayu Jobs: టెన్త్ అర్హతతో భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వచ్చేసింది.. -->
E-Paper
Advertisement

Agniveer Vayu Jobs: టెన్త్ అర్హతతో భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వచ్చేసింది..

Agniveer Vayu Jobs: టెన్త్ అర్హతతో భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వచ్చేసింది..
Advertisement

Agniveer Vayu Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. టెన్త్ క్లాస్ పాసై ఉండి. నిర్దిష్ట శారీరక దారుఢ్య, వైద్య ప్రమాణాలు, మ్యూజికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్ ఉండాలి. వాయిద్య పరికరం వాయించడంలో ప్రావీణ్యం తప్పనిసరి ఉండాలి. అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 11న దరఖాస్తు గడువు ముగియనుంది.

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా.. అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. అగ్నివీర్ వాయు (మ్యుజీషియన్‌) (01/ 2026) ఖాళీల భర్తీకి ఐఏఎఫ్‌ ఆన్‌ లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

Advertisement

NOTE: అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థులు మే 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభ తేది: ఏప్రిల్ 21

Advertisement

దరఖాస్తు చివరి తేది: మే 11

వెకెన్సీ వివరాలు: భారత వాయుసేన- అగ్నివీర్ వాయు (మ్యుజీషియన్‌)

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మ్యూజిక్ నైపుణ్యాలు వచ్చి ఉండాలి. కన్సర్ట్‌ ప్లూట్‌/ పికోలో,  ఒబో, Eb / Bbలో క్లారినెట్, Eb / Bbలో సాక్సోఫోన్, F /Bbలో ఫ్రెంచ్ హార్న్, Eb /C /Bbలో ట్రంపెట్, Bb/Gలో ట్రోంబోన్, యుఫోనియం, Eb /Bbలో బాస్ / ట్యూబా, కీబోర్డ్ / ఆర్గాన్ / పియానో, గిటార్ (అకౌస్టిక్ / లీడ్ / బాస్), వయోలిన్, వయోలా, స్ట్రింగ్ బాస్, అన్ని భారతీయ శాస్త్రీయ వాయిద్యాల్లోని ఏదైనా ఒక దాంట్లో నైపుణ్యాన్ని కలిగి ఉండాలి.

విద్యార్హత: టెన్త్ క్లాస్ పాసై ఉండాలి. అలాగే శారీరక దారుఢ్య, వైద్య ప్రమాణాలు, మ్యూజికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికేట్‌ ఉండాలి. వాయిద్య పరికరం వాయించడంలో ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలి.

హైట్: పురుషులు 162 సెం.మీ, మహిళా అభ్యర్థులకు 152 సెం.మీ కనీస హైట్ ఉండాలి.

వయస్సు: 2005 జనవరి 1 నుంచి 2008 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: మ్యూజిక్ ఇన్ స్ట్రుమెంట్స్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంగ్లిష్, అడాప్టబిలిటీ టెస్ట్, ఫిజికిల్ ఫిట్ నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, తదితర ఆధారంగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

వేతనం: మొదటి సంవత్సరం రూ.30,000, రెండో సంవత్సరం రూ.33,000, మూడో సంవత్సరం రూ.36,500, నాలుగో సంవత్సరం రూ.40,000 జీతం కల్పిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.100 ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

రిక్రూట్మెంట్ ర్యాలీ షెడ్యూల్: 2025 జూన్ 10 నుంచి జూన్ 18 వరకు ఉంటుంది.

ర్యాలీ వేదిక: 2 ఏఎస్‌సీ సీ/ఓ రేస్ కోర్స్ క్యాంప్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ న్యూ ఢిల్లీ (న్యూఢిల్లీ), 7 ఏఎస్‌సీ, నెం.1 కబ్బన్ రోడ్, బెంగళూరు (కర్ణాటక)లో ర్యాలీ జరగనుంది.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

☀ భారత వాయుసేన అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

☀ దరఖాస్తు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 21

☀ దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 11

ALSO READ: CPCB Recruitment: టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.1,00,000 పైగా వేతనం.. ఇంకెందుకు ఆలస్యం..!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×