// // Indian Army Jobs: డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. ట్రైనింగ్‌లోనే రూ.56,100 వేతనం -->
E-Paper
Advertisement

Indian Army Jobs: డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. ట్రైనింగ్‌లోనే రూ.56,100 వేతనం

Indian Army Jobs: డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. ట్రైనింగ్‌లోనే రూ.56,100 వేతనం
Advertisement

Indian Army Jobs: నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. 50 శాతం మార్కులతో డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ సూపర్ న్యూస్ చెప్పింది. ఇండియన్ ఆర్మీ, షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 58వ కోర్సు ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.

అర్హులైన గ్రాడ్యుయేట్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 15న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ తేదీ లోగా ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

ALSO READ: NAFED Recruitment: ఈ ఉద్యోగం వస్తే లైఫ్ సెట్ భయ్యా.. నెలకు రూ.1,50,000 జీతం.. ఇంకా మూడు రోజులే..!

షార్ట సర్వీస్ కమిషన్ ద్వారా ఇండియన్ ఆర్మీఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 58వ కోర్సు ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుషలు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన లో దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 76 (ఇందులో ఎన్‌సీీసీ పురుష అభ్యర్థులకు 70 పోస్టులు, ఎన్‌సీసీ అభ్యర్థులకు 6 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.)

ఈ 76  ఉద్యోగాల్లో ఎనిమిది ఉద్యోగాలు యుద్ధంలో ప్రాణాలర్పించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఇవ్వనున్నారు.

ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 58వ కోర్సు(అక్టోబర్ 2025) పేరులో ప్రవేశాలు కోరుతున్నారు.

దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 15

విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా పాసై ఉండాలి. ఫైనల్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఇండియన్ ఆర్మీలోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మూడు అకడమిక్ ఇయర్ లు ఎన్ సీసీ సీనియర్ డివిజన్ వింగ్ లో కొనసాగి ఉండాలి. ఎన్‌సీసీ సీ సర్టిఫికేట్ లో కనీసం బి గ్రేడ్ పొంది అయినా ఉండాలి.

-యుద్దంలో ప్రాణాలు అర్పించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్‌సీసీ సీ సర్టిపికెట్ అవసరం లేదు.

వయస్సు: 2025 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 19 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

ఉద్యోగ ఎంపిక విధానం: అప్లికేషన్ షార్ట్ లిస్ట్, స్టేజ్-1, స్టేజ్-2 టెస్టులు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

శిక్షణ: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో 49 వారాల ట్రైనింగ్ ఉంటుంది.

జీతం: ట్రైనింగ్ పీరియడ్ లో ప్రతి నెల రూ.56,100 స్టైఫండ్ కల్పిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పీజీ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్ మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మద్రాస్ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. వీరిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.

అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ వెంటనే ఇండియన్ ఆర్మీలోని ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. మార్చి 15తో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మొదల నెల నుంచి మంచి వేతనం ఇవ్వనున్నారు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఇండియన్ ఆర్మీలోని ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ALSO READ: CISF Recruitment: గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఇంకెందుకు ఆలస్యం..

ముఖ్యమైనవి:

మొత్తం పోస్టుల సంఖ్య: 76

దరఖాస్తుకు చివరి తేది: మార్చి 15

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×