// // UCO Bank: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్థానిక భాష వస్తే చాలు, ఇదే మంచి అవకాశం -->
E-Paper
Advertisement

UCO Bank: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్థానిక భాష వస్తే చాలు, ఇదే మంచి అవకాశం

UCO Bank: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్థానిక భాష వస్తే చాలు, ఇదే మంచి అవకాశం
Advertisement

UCO Bank: నిరుద్యోగులకు ఇది శుభవార్త. యుకో బ్యాంక్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ పాసైన వారికి ఇది మంచి అవకాశం. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి స్టైఫండ్ ఉంటుంది. నెలకు రూ.15వేల వరకు స్టైఫండ్ అందజేస్తారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు, పోస్టులు తదితర వివరాల గురించి స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కోల్‌కతా హెడ్‌ క్వార్టర్స్‌ గా  ఉన్న యుకో బ్యాంక్ నుంచి 2025-26 సంవత్సరానికి 532 అప్రెంటిస్ ఖాళీల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులకు మంచి అవకాశం అని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వెకెన్సీలు ఉన్నాయి. అక్టోబర్ 30న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 532

యూకో బ్యాంక్ లో అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఏపీలో 7 పోస్టులు, తెలంగాణలో 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఉద్యోగ ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, స్థానిక భాషా పరిజ్ఞానం ఎగ్జామినేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

విద్యార్హత: డిగ్రీ అర్హత గల అభ్యర్థులు అక్టోబర్‌ 30 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవచ్చు.

రాష్ట్రాల వారీగా వెకెన్సీ వివరాలు చూసినట్లయితే..

ఏపీ: 7 పోస్టులు

తెలంగాణ: 8 పోస్టులు

తమిళనాడు: 21 పోస్టులు

కర్నాటక: 12 పోస్టులు

కేరళ: 10 పోస్టులు

యూపీ: 46 పోస్టులు

వెస్ట్ బెంగాల్: 86 పోస్టులు

బిహార్: 35 పోస్టులు

విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి.

వయస్సు: 2025 అక్టోబర్ 1 నాటికి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల వయస్సు ఉండాలి.

స్టైఫండ్: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టైఫండ్ ఉంటుంది. నెలకు రూ.15 వేల వరకు స్టైఫండ్ అందజేస్తారు.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800 ఫీజు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 అక్టోబర్ 21

దరఖాస్తుకు చివరి తేది: 2025 అక్టోబర్ 30

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://uco.bank.in

నోటిఫికేషన్ కీలక సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 532

దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 30

ALSO READ: AIIMS: మంగళగిరిలో ఉద్యోగాలు.. అక్షరాల రూ.1,68,900 జీతం, ఇంకా 2 రోజులే సమయం

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×