// // NABARD Recruitment: డిగ్రీ అర్హతతో నాబార్డులో ఉద్యోగాలు.. జీతం ఏడాదికి రూ.70లక్షలు -->
E-Paper
Advertisement

NABARD Recruitment: డిగ్రీ అర్హతతో నాబార్డులో ఉద్యోగాలు.. జీతం ఏడాదికి రూ.70లక్షలు.. ఇంకెందుకు ఆలస్యం

NABARD Recruitment: డిగ్రీ అర్హతతో నాబార్డులో ఉద్యోగాలు.. జీతం ఏడాదికి రూ.70లక్షలు.. ఇంకెందుకు ఆలస్యం
Advertisement

NABARD Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బీసీఏ, ఎంసీఏ, పీజీ డిప్లొమా పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశమే అని చెప్పవచ్చు. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (NABARD) కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను సవివరంగా తెలుసుకుందాం.

ముంబయి, బాంద్రాలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవెలప్ మెంట్ (NABARD) లో కాంట్రాక్ట్ విధానంలో స్పెషలిస్ట్ పోస్టులు భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 6న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 5

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవెలప్ మెంట్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో సీఐఎస్‌ఓ, క్లైమేట్ చేంజ్ స్పెషలిస్ట్ – మిటిగేషన్, క్లైమేట్ చేంజ్ స్పెషలిస్ట్ – అడాప్షన్, కంటెంట్ రైటర్, గ్రాఫిక్ డిజైనర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

వెకెన్సీ వారీగా పోస్టులు చూసినట్లయితే..

* సీఐఎస్‌ఓ- 01
* క్లైమేట్‌ చేంజ్‌ స్పెషలిస్ట్‌-మిటిగేషన్‌- 01
* క్లైమేట్‌ చేంజ్‌ స్పెషలిస్ట్‌-అడాప్షన్‌- 01
* కంటెంట్‌ రైటర్‌- 01
* గ్రాఫిక్‌ డిజైనర్‌- 01

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, బీసీఏ, ఎంసీఏ, పీజీ, పీజీ డిప్లొమా పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను పరిగణలోకి తీసుకుంటారు.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మార్చి 23

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 6

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

వయస్సు:  ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. సీఐఎస్‌ఓ పోస్టులకు 45 నుంచి 55ఏళ్లు; క్లైమేట్‌ చేంజ్‌ స్పెషలిస్ట్‌-మిటిగేషన్‌, క్లైమేట్‌ చేంజ్‌ స్పెషలిస్ట్‌-అడాప్షన్‌ పోస్టులకు 35 నుంచి 55ఏళ్లు; కంటెంట్‌ రైటర్‌కు, గ్రాఫిక్‌ డిజైనర్‌కు 21 నుంచి 45 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనం నిర్ధారించారు. ఏడాదికి సీఐఎస్‌ఓ పోస్టులకు రూ.50- రూ.70లక్షలు; క్లైమేట్‌ చేంజ్‌ స్పెషలిస్ట్‌-మిటిగేషన్‌, క్లైమేట్‌ చేంజ్‌ స్పెషలిస్ట్‌-అడాప్షన్‌ పోస్టులకు అయితే రూ.25- 30లక్షలు; కంటెంట్‌ రైటర్‌కు, గ్రాఫిక్‌ డిజైనర్‌ పోస్టులకు రూ.12 లక్షలు వేతనం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ఫీజు: ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850 ఫీజు ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఇంటిమేషన్‌ చార్జెస్‌ రూ.150 ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.nabard.org

ముఖ్య సమాచారం:

మొత్తం పోస్టుల సంఖ్య: 5

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 6

ALSO READ: JOBS: తెలంగాణలో ఆ జిల్లాలో ఉద్యోగాలు.. స్టార్టింగ్ జీతమే రూ.60,000.. మీరు కూడా అర్హులే..!

ALSO READ: RRB Recruitment: టెన్త్, ఐటీఐ, డిగ్రీ అర్హతతో రైల్వేలో 9970 ఉద్యోగాలు.. భారీ వేతనం.. పూర్తి వివరాలివే..

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×