// // JOBS: డిగ్రీ అర్హతతో 400 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్.. దరఖాస్తు చేసుకున్నారా..? -->
E-Paper
Advertisement

JOBS: డిగ్రీ అర్హతతో 400 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్.. దరఖాస్తు చేసుకున్నారా..?

JOBS: డిగ్రీ అర్హతతో 400 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్.. దరఖాస్తు చేసుకున్నారా..?
Advertisement

BOI Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త అనే చెప్పవచ్చు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వివరాలను సవివరంగా తెల్సుకుందాం.

NOTE: రేపటితోనే దరఖాస్తు గడువు ముగియనుంది.

Advertisement

ముంబయిలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (BOI) బిహార్‌, ఛత్తస్‌గఢ్‌, ఢిల్లీ, గుజరాత్, జార్ఖండ్‌, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌, తమిళనాడు, త్రిపుర, ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ్ బెంగాల్‌ జోన్‌లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.అయితే మార్చి 15న ముగిసిన దరఖాస్తు గడువును అధికారులు వాయిదా వేశారు. మార్చి 28వ తేదీ వరకు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

మొత్తం పోస్టుల సంఖ్య: 400

Advertisement

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (BOI) లో అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

దేశంలోని పలు జోన్లలో ఈ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. బిహార్‌, ఛత్తస్‌గఢ్‌, ఢిల్లీ, గుజరాత్, జార్ఖండ్‌, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌, తమిళనాడు, త్రిపుర, ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ్ బెంగాల్‌ జోన్‌లలో అప్రెంటీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. ఈ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

వయస్సు: 2025 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 మార్చి 28

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600 ఫీజు ఉంటుంది. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.400 ఫీజు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: అభ్యర్థులు రాత పరీక్ష ద్వారా పోస్టుకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ విధానం: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి.

స్టైఫండ్: పోస్టుకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టైఫండ్ ఇస్తారు. అభ్యర్థులకు నెలకు రూ.12,000 స్టైఫండ్ ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://bankofindia.co.in

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు పెట్టుకోండి. ఏడాది పాటు స్టైఫండ్ కూడా కల్పిస్తారు. నెలకు రూ.12వేల చొప్పున స్టైఫండ్ ఇస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ పోస్టులకు అప్లై చేయండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం పోస్టుల సంఖ్య: 400

దరఖాస్తుకు చివరి తేది: మార్చి 28

రేపటితోనే దరఖాస్తు గడువు ముగియనుంది.

ALSO READ: NTPC-NGEL: సువర్ణవకాశం.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. రూ.11,00,000 జీతం భయ్యా..

ALSO READ: CSIR-CRRI: ఇంటర్ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.63,200.. మరి ఆలస్యం ఎందుకు..?

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×