// // CBI Recruitment: నెలకు రూ.1,20,940 వరకు జీతం.. సీబీఐ నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్ -->
E-Paper
Advertisement

CBI Recruitment: నెలకు రూ.1,20,940 వరకు జీతం.. సీబీఐ నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్

CBI Recruitment: నెలకు రూ.1,20,940 వరకు జీతం.. సీబీఐ నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్
Advertisement

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 275 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్ డెవలపర్, డేటా సైంటిస్ట్, ఐటీ ఆఫీసర్ వంటి కీలక పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోండి.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 275

Advertisement

పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21 రకాల స్పెషలిస్ట్ ఉద్యోగాలను బ్యాంక్ భర్తీ చేస్తోంది. వీటిలో సాఫ్ట్‌వేర్ డెవలపర్ (జావా, డాట్ నెట్) పోస్టులు 19 ఉన్నాయి. మొబైల్ డెవలపర్ 3, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ 11, డిజిటల్ ఛానల్ మేనేజర్ 23 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ విభాగంలో అత్యధికంగా 38 పోస్టులు ఉన్నాయి. ఐటీ ఆఫీసర్ విభాగంలో 82 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ మేనేజర్, రిస్క్ మేనేజర్ లాంటి ఇతర విభాగాల్లోనూ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హత:  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్, ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఎంసీఏ పూర్తి చేసిన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలతో పాటు సంబంధిత విభాగంలో ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

Advertisement

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి 2 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. వయోపరిమితిని పరిశీలిస్తే.. స్కేల్-IV పోస్టులకు 45 ఏళ్లు మించరాదు. స్కేల్-I ఉద్యోగాలకు 30 ఏళ్లు గరిష్ట పరిమితిగా నిర్ణయించారు.

జీతం: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ జీతాలను చెల్లిస్తుంది. స్కేల్-IV ఉద్యోగులకు నెలకు గరిష్టంగా రూ.1,20,940 వరకు జీతం లభిస్తుంది. స్కేల్-III అభ్యర్థులకు రూ.1,05,280 వరకు చెల్లిస్తారు. స్కేల్-II పోస్టులకు రూ.93,960 వరకు అలాగే స్కేల్-I పోస్టులకు రూ.85,920 వరకు వేతనం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ రాత పరీక్ష కీలకం కానుంది. దీనిలో మెరిట్ సాధించిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు:  జనరల్ అభ్యర్థులు రూ.850 ప్లస్ జీఎస్‌టీ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175 ప్లస్ జీఎస్‌టీగా నిర్ణయించారు.

ఎగ్జామ్ సెంటర్స్: తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థుల సౌకర్యార్థం హైదరాబాద్, వరంగల్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ముఖ్యమైన తేదీలు:  ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 28న ప్రారంభమై మార్చి 23వ తేదీతో ముగియనుంది. పరీక్షను ఏప్రిల్ 2026లో నిర్వహించే అవకాశం ఉంది.

దరఖాస్తుకు ప్రారంభ తేది: ఫిబ్రవరి 28

దరఖాస్తుకు చివరి తేది: మార్చి 23

ఎగ్జామ్: 2026 ఏప్రిల్ (అంచనా)

అఫీషియల్ వెబ్ సైట్: https://centralbank.bank.in/

ALSO READ: Summer Special Trains: సమ్మర్ ట్రావెలర్స్ కు గుడ్ న్యూస్.. 1,484 స్పెషల్ ట్రైన్స్ ప్రకటించిన రైల్వే!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×