// // Indian Railway: 22,195 గ్రూప్-D ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా..? ఇంకా 4 రోజులే మిత్రమా, అద్భుతమైన అవకాశం -->
E-Paper
Advertisement

Indian Railway: 22,195 గ్రూప్-D ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా..? ఇంకా 4 రోజులే మిత్రమా, అద్భుతమైన అవకాశం

Indian Railway: 22,195 గ్రూప్-D ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా..? ఇంకా 4 రోజులే మిత్రమా, అద్భుతమైన అవకాశం
Advertisement

రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. భారతీయ రైల్వే భారీ స్థాయిలో భారీగా గ్రూప్- డీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

భారతీయ రైల్వే నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 22,195 గ్రూప్-D (లెవల్-1) పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తు గడువు కూడా త్వరలోనే ముగియనుంది.

Advertisement

విద్యార్హతలు: 

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి (10th Class) లేదా ఐటీఐ (ITI) ఉత్తీర్ణులై ఉండాలి.

Advertisement

వయస్సు: 

అభ్యర్థుల వయస్సు 18 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వరకు మినహాయింపు లభిస్తుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: 

అభ్యర్థుల ఎంపిక మొత్తం నాలుగు దశల్లో జరుగుతుంది..

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT): అభ్యర్థుల మేధస్సును పరీక్షించేందుకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.

శారీరక సామర్థ్య పరీక్ష (PET): CBTలో అర్హత సాధించిన వారికి శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు.

డాక్యుమెంట్ వెరిఫికేషన్: విద్యార్హత పత్రాలను తనిఖీ చేస్తారు.

మెడికల్ టెస్ట్: అభ్యర్థి ఆరోగ్య స్థితిగతులను రైల్వే వైద్య ప్రమాణాల ప్రకారం పరీక్షిస్తారు.

దరఖాస్తు ఫీజు: 

సాధారణ, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 500 గా నిర్ణయించారు. ఎస్సీ (SC), ఎస్టీ (ST), దివ్యాంగులు (PwBD), మహిళలు, మాజీ సైనికోద్యోగులకు ఫీజులో రాయితీ ఉంటుంది, వారు రూ. 250 చెల్లిస్తే సరిపోతుంది.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.rrbcdg.gov.in/ సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవాలి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.rrbcdg.gov.in

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 2. గడువు ముగిసే వరకు వేచి చూడకుండా, సాంకేతిక ఇబ్బందులు తలెత్తకముందే దరఖాస్తు చేసుకోవడం బెటర్ అని అధికారులు తెలుపుతున్నారు. రైల్వేలో స్థిరమైన భవిష్యత్తును కోరుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

దరఖాస్తుకు చివరి తేది: మార్చి 2

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 22,195

ALSO READ: Air India Offers: జస్ట్ రూ.1450కే ప్లైట్ టికెట్.. ఎయిర్ ఇండియా క్రేజీ ఆఫర్!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×