// // SBI Notification: రూ.లక్షల్లో జీతాలు, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, దరఖాస్తుకు చివరి తేది ఇదే.. -->
E-Paper
Advertisement

SBI Notification: రూ.లక్షల్లో జీతాలు, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, దరఖాస్తుకు చివరి తేది ఇదే..

SBI Notification: రూ.లక్షల్లో జీతాలు, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, దరఖాస్తుకు చివరి తేది ఇదే..
Advertisement

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు అదిరిపోయే తీపి కబురు చెప్పింది. భారీ జీతంతో కూడిన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తూ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు: 

Advertisement

బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం. మొత్తం 116 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో 12 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. అలాగే డిప్యూటీ మేనేజర్ (IS ఆడిట్) విభాగంలో 104 పోస్టులు కేటాయించారు. టెక్నాలజీ, ఆడిటింగ్ రంగాల్లో ఎక్స్ పీరియన్స్ ఉన్న వారికి ఇవి మెరుగైన అవకాశం ఉండనుంది.

విద్యార్హతలు:

Advertisement

అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఎమ్మెస్సీ చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యా అర్హతలతో పాటు సంబంధిత రంగంలో కచ్చితంగా  వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారని బ్యాంక్ స్పష్టం చేసింది.

వయస్సు వివరాలు: 

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం:  

ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకున్న వారి ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ చేసి తుది ఎంపిక ప్రక్రియ చేపడతారు.

దరఖాస్తు విధానం: 

ఆసక్తి గల వారు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులు 750 రూపాయల ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

ముఖ్యమైన తేదీల వివరాలు:  

దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమైంది. మార్చి 15వ తేదీని దరఖాస్తుకు చివరి గడువుగా నిర్ణయించారు. అభ్యర్థులు గడువు ముగిసేలోపు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలి.

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ. లక్షల్లో జీతాలు ఉంటాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://sbi.co.in

అప్లికేషన్ లింక్: https://recruitment.sbi.bank.in/

ALSO READ: Railway Recruitment: నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది.. రైల్వేలో రాతపరీక్ష లేకుండానే జాబ్, త్వరపడండి

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×