E-Paper
Advertisement

అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. చిలుకూరు బాలాజీ టెంపుల్‌పై అక్కసు, ఏం జరిగింది?

అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. చిలుకూరు బాలాజీ టెంపుల్‌పై అక్కసు, ఏం జరిగింది?
Advertisement

America: అమెరికా రాజకీయ నేతల కండకావరం మరోసారి బయటపడింది. మిస్సౌరీ సెనేటర్ ఎరిక్ ష్మిత్ భారతీయులను లక్ష్యంగా చేసుకుని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలపై అమెరికాతోపాటు ఇండియాలోనూ చర్చకు దారి తీసింది. ఇంతకూ వీసాకు-చిలుకూరు టెంపుల్‌ని ఎందుకు ఆయన లక్ష్యంగా చేసుకున్నారు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

అమెరికా సెనేటర్ ఎరిక్ ష్మిత్ వివాదాస్పద వ్యాఖ్యలు

Advertisement

అమెరికన్లకు ఉద్యోగాలు రాకుండా హెచ్‌1బీ వీసాల మాటున భారతీయులు ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని విమర్శించారు అమెరికా సెనేటర్ ఎరిక్ ష్మిత్. H-1B వీసాల ముసుగులో భారతీయులు ఉద్యోగాలను లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు ప్రపంచవ్యాప్తంగా ఒక ‘వీసా కార్టెల్’ నడుస్తోందని ఆరోపించారు.

హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని వీసాల మాఫియాకు అడ్డాగా వక్రీకరిస్తూ ఆయన చేసిన వరుస ట్వీట్లు దుమారం రేపుతున్నాయి. ఈ వీసాల కార్టెల్‌కు ఓ వీసాల దేవాలయం ఉందని వ్యాఖ్యానించారు. వీసాల కోసం భారతీయ యువతీయువకులు ఆ దేవాలయం చుట్టూ తిరుగుతారని తిరుగుతుంటారని రాసుకొచ్చారు.

Advertisement

చిలుకూరు బాలాజీ టెంపుల్‌పై అక్కసు వెళ్లగక్కిన సెనేటర్

వీసాలు లభించేలా అక్కడికి వెళ్లి ఆశీర్వాదాలు తీసుకుంటారని ఎద్దేవా చేశారు. అంతేకాదు చిలుకూరు బాలాజీ దేవాలయం ఫోటోను అందులో పోస్టు చేశారు. బిలియన్ల డాలర్ల డబ్బు ఏఐ ట్రైనింగ్ కోసం భారత్‌కు వెళ్తోందన్నారు. అందుకు అమెరికా సబ్సిడీలు ఇస్తోందంటూ తన పైత్యాన్ని బయటపెట్టారు. వీసా కార్టెల్‌కు ఆ దేవాలయం ప్రధాన కేంద్రంగా వర్ణించారు.

వీసా కార్టెల్‌కు ఆ దేవాలయం ప్రధాన కేంద్రంగా ఉందన్నారు. హెచ్-1బి, ఎల్-1, ఎఫ్-1 వంటి వీసాల వల్ల అమెరికా స్థానిక వేతన వ్యవస్థలను దెబ్బ తీస్తున్నాయని పేర్కొన్నారు. తక్కువ వేతనాలకు భారతీయులు రావడంతో టెక్ కంపెనీలు అమెరికన్ విద్యార్థులను పక్కనపెట్టి భారతీయులకు ప్రయార్టీ ఇస్తున్నారని రుసరుసలాడారు. ప్రతిభ కంటే జాతి పక్షపాతం పెరిగిపోతోందని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

ALSO READ: ఒమన్‌లో భారత్ నౌకపై దాడి.. ఆపై మునిగిన హాజీ అలీ, ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం

ఇంకో ట్వీట్‌లో భారతీయ విద్యార్థులపైనా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు సెనేటర్. విదేశీ విద్యార్థుల్లో సగం మంది భారతీయులేనన్నారు. వారంతా పన్ను చెల్లింపుదారుల నిధులతో రాయితీ వర్క్‌ పర్మిట్లను పొందుతున్నారని, చదువు పూర్తి అయ్యాక హెచ్‌1బీ పొందుతారని పేర్కొన్నారు. ఆ తర్వాత గ్రీన్‌కార్డు కోసం పోటీ పడుతున్నారని రుసరుసలాడారు.

తక్కువ వేతనాలతో పనిచేసే వీరితో అమెరికన్‌ గ్రాడ్యుయేట్లు పోటీపడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా వీసా కార్టెల్‌లో భాగమని అన్నారు. నెట్‌వర్క్‌లు విదేశాల నుండి నియామకాలు చేపడతాయని, రెజ్యూమెలలో అబద్ధాలు చెబుతారని రాసుకొచ్చారు. వీసా ఇంటర్వ్యూలో అడిగే రహస్య ప్రశ్నలను వారు వీసా దరఖాస్తుదారులతో పంచుకుంటారని ఘాటుగా విమర్శలు చేశారు.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×