E-Paper
Advertisement

ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగిన యువతి!

ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగిన యువతి!
Advertisement

Acid Bottle: ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దాహమేసి మంచి నీళ్లు అనుకుని ఓ యువతి యాసిడ్ తాగింది. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

జ్యూవెలరీ షాప్‌లో దారుణం..

Advertisement

హాపూర్‌లోని అర్జున్ నగర్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది. ఒక యువతి కొన్ని ఆభరణాలు కొనుగోలు చేయడానికి స్థానిక జ్యువెలరీ షాప్‌నకు వెళ్లింది. నగలు చూస్తున్న సమయంలో ఆమెకు తీవ్రంగా దాహం వేసింది. దీంతో తాగడానికి కొన్ని నీళ్లు ఇవ్వాలని అక్కడి దుకాణదారుడిని కోరింది.

సీల్డ్ బాటిల్‌లో యాసిడ్

Advertisement

ఆభరణాల వ్యాపారి వెంటనే స్పందించి.. పక్కనే ఉన్న ఒక మిఠాయి దుకాణం (స్వీట్ షాప్) నుంచి నీళ్లు తీసుకురావాలని ఓ చిన్న బాలుడిని పంపించాడు. ఆ బాలుడు తెచ్చిన, పూర్తిగా సీల్ చేసి ఉన్న ఒక వాటర్ బాటిల్‌ను ఓపెన్ చేసి యువతికి ఇచ్చారు. దాన్ని మంచి నీళ్లే అనుకుని ఆమె నోట్లో పోసుకుని తాగింది. అంతే.. మరుక్షణమే నోరంతా తీవ్రంగా మండిపోవడంతో గట్టిగా అరుస్తూ బయటకు పరుగెత్తి, ఆ ద్రావణాన్ని ఉమ్మేసింది.

కొనసాగుతున్న విచారణ

బాటిల్‌లో ఉన్నది నీళ్లు కాదని, ప్రమాదకరమైన యాసిడ్ అని గుర్తించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా మారింది.

కేసు నమోదు..

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మిఠాయి దుకాణం యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, తమ దుకాణానికి సరఫరా అయిన బాటిళ్లలోనే ఆ యాసిడ్ ఉందని, అందులో యాసిడ్ ఉన్న విషయం తనకు అస్సలు తెలియదని అతడు పోలీసులకు తెలిపాడు. దీంతో షాప్‌లోని మిగిలిన బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.

Related News

రష్యా చమురుపై యూఎస్ కొత్త బిల్లు.. భారత్, చైనాలకు భారీగా తగ్గిన పెనాల్టీ భారం

బంగ్లాదేశ్‌లో వరద బీభత్సం.. 54 మంది మృతి, రోడ్డున పడ్డ 6 లక్షల మంది

మోస్ట్ డేంజర్ ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వెతికి ఆ ఫ్యామిలీని చంపేసింది

నేపాల్‌లో రగులుతున్న మరో జెన్-జీ ఉద్యమం.. ఏకంగా ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్.. ఎందుకంటే?

యుద్ధ చరిత్రలోనే తొలిసారి.. ఇరాన్ నావికా స్థావరంపై అమెరికా సీ డ్రోన్ల ఊహించని మెరుపు దాడి

హర్మూజ్‌లో 20 శాతం టోల్‌ ఇష్యూ.. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కౌంటర్, మార్కెట్లో ఆయిల్ ధరల మంటలు

హెలికాప్టర్ గన్‌తో పిచ్చి ప్రయోగాలు.. ఒక్కసారిగా తిరగబడ్డ మెషీన్‌గన్, వీడియో వైరల్

Tehran: ఖమేనీ అంత్యక్రియల్లో ముసుగు వీరుడు.. ఆ వ్యక్తి గుట్టు వీడింది, అతడు ఎవరో తెలుసా?

Big Stories

Advertisement
×