E-Paper
Advertisement

మోస్ట్ డేంజర్ ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వెతికి ఆ ఫ్యామిలీని చంపేసింది

మోస్ట్ డేంజర్ ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వెతికి ఆ ఫ్యామిలీని చంపేసింది
Advertisement

Elephant Revange: సృష్టిలో కొన్ని జంతువులకు రివేంజ్ చాలా ఎక్కువగా ఉంటుంది.  తమను ఏమైనా చేస్తే ఆ ఫ్యామిలీని వెంటాడుతాయి. వాటిలో పాముతోపాటు రకరకాల జంతువులు ఉన్నాయి.  ఆ జాబిాతాలోకి ఇప్పుడు ఏనుగు కూడా చేరిపోయింది. నేపాల్‌లో ఊహించని ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల తర్వాత ఓ కుటుంబాన్ని వెంటాడి మరీ చంపేసింది ఆ ఏనుగు. అసలు స్టోరీలోకి వెళ్తే..

నేపాల్‌లో దారుణమైన ఘటన-నేపాల్‌లోని చిత్వాన్ నేషనల్ పార్క్ సమీపంలో శనిచర బోటే కుటుంబం ఉండేది. అయితే ఆ ఫ్యామిలీకి ‘ధుర్బే’ ఏనుగు రూపంలో యముడు వెంటాడుతూ వచ్చాడు. 2012 డిసెంబర్‌లో మాడి పట్టణంలో ‘ధుర్బే’ ఏనుగు దాడి చేసింది. దీంతో శనిచర పేరెంట్స్ ప్రాణాలు కోల్పోయారు. ఈ భయంకరమైన ఘటనతో షాక్‌కు గురైన శనిచర, తన కుటుంబాన్ని ఏనుగు నుంచి కాపాడుకోవాలని డిసైడ్ అయ్యాడు.

Advertisement

మోస్ట్ డేంజర్  ధుర్బే ఏనుగు-ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని  అక్కడి నుంచి మకాం మార్చేశాడు. రాప్తి నది దాటిన తర్వాత దాదాపు 9 మైళ్ల దూరంలో ఉన్న జగత్‌పూర్‌ ప్రాంతానికి తన నివాసాన్ని మార్చుకున్నాడు. ఆ ఏనుగు నుంచి ఎలాంటి ముప్పు ఉండదని భావించాడు.  హాయిగా సాగుతోంది శనిచర ఫ్యామిలీ జీవితం. దాన్ని నుంచి  తాము తప్పించుకున్నామని ఆ కుటుంబం హాయిగా ఉంటోంది.

14 ఏళ్ల తర్వాత ఓ ఫ్యామిలీని వెంటాడి మరీ చంపింది-మళ్లీ వారి జీవితాల్లో ధుర్భే ఏనుగు ఎంట్రీ ఇచ్చింది. జూలై మొదటి వారంలో  శనిచర ఫ్యామిలీలో ఊహించని  విషాదం చోటుచేసుకుంది. దాదాపు  14 ఏళ్ల తర్వాత ఆ ఏనుగు.. వీరి జాడను పసిగట్టి వెతుక్కుంటూ వచ్చింది. ఈనెల మొదటి వారంలో జగత్‌పూర్‌లోని శనిచర ఇంటిపై దాడి చేసింది. శనిచర కోడలు ఆషికా, నాలుగేళ్ల మనవడు భరత్ అతి కిరాతకంగా చంపేసింది.

Advertisement

కన్నీరుమున్నీరౌైన బోటేలు-ఈ ఘటనతో బోటేలు గుండెలు పగిలేలా రోదించాడు. నదులు దాటి ఇంత దూరం వస్తే ఏమీ చేయలేదని నమ్మామని, ఇన్ని ఏళ్ల తర్వాత ఆ ఏనుగు వెతుక్కుంటూ వచ్చి కోడలు, మనవడ్ని చంపేసిందని కన్నీరు మున్నీరు అయ్యాడు. తాము పారిపోవడానికి చోటు లేదని నెత్తి నోరు కొట్టుకుంటూ ఏడ్వడం మొదలుపెట్టాడు. తాజా దాడితో 14 ఏళ్ల వ్యవధిలో ఆ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు  ఆ ఏనుగు చేతిలో మరణించారు.

వికీపీడియాలో  ఈ ఏనుగుకు ఓ పేజీ –నేపాల్‌లో ‘ధుర్బే’ ఏనుగు అత్యంత ప్రమాదకరమైనదిగా చెబుతారు వివిధ ప్రాంతాల వాసులు. 2010 నుంచి ఇప్పటివరకు ఆ ఏనుగు రెండు డజన్ల మందిని చంపినట్లు చిత్వాన్ నేషనల్ పార్క్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఘటనకు ముందు 23 మందిని చంపినట్లు మా రికార్డుల్లో ఉందని చెబుతున్నారు. ఈ ఘటనతో ఆ సంఖ్య 25కు చేరింది.  తాజా మరో విషయం ఏంటంటే.. ఈ ఏనుగు పేరు మీద వికీపీడియాలో ఒక పేజీ కూడా ఉంది.

ALSO READ: నేపాల్‌లో రగులుతున్న మరో జెన్-జీ ఉద్యమం.. ఏకంగా ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్.. ఎందుకంటే?

ధ్రుబే ఏనుగు కదలికలను పర్యవేక్షించడానికి 2016 నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు అటవీ అధికారులు.  దానికి ట్రాకింగ్ కాలర్ అమర్చారు. 2020, 2023లో ఆ కాలర్‌ను మార్చినప్పటికీ పూర్తిగా నియంత్రించడంలో విఫలమయ్యారు అధికారులు. అడవులు తగ్గిపోవడం, మానవ నివాసాలు పెరగడం వల్ల నేపాల్‌లో ఇలాంటి ఘర్షణలు పెరుగుతున్నాయని అంటున్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×