// // Kharg Island: ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కొట్టేశాం.. ఖర్గ్ ఐలాండ్‌పై దాడులు.. ట్రంప్ ప్రకటన -->
E-Paper
Advertisement

Kharg Island: ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కొట్టేశాం.. ఖర్గ్ ఐలాండ్‌పై వరుసగా బాంబు దాడులు.. ట్రంప్ ప్రకటన

Kharg Island: ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కొట్టేశాం.. ఖర్గ్ ఐలాండ్‌పై వరుసగా బాంబు దాడులు.. ట్రంప్ ప్రకటన
Advertisement

Kharg Island: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొత్త మలుపు తిరిగింది. ఇరాన్ పదే పదే అమెరికాకు వార్నింగ్‌లు ఇవ్వడంతో ఆ దేశం దూకుడు ప్రదర్శించింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఖర్గ్ ఐలాండ్ పై వైమానిక దాడులు చేసింది అమెరికా. ఏకంగా ఆ ఐలాండ్‌ని ధ్వంసం చేసింది.

ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కొట్టిన అమెరికా

Advertisement

ఇరాన్‌పై అమెరికా దూకుడు పెంచింది. వారం రోజుల్లో యుద్ధం ముగించాలని భావిస్తోంది. ఆ విధంగా ముందుకు అడుగులు కదులుతోంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా వైమానిక దాడులు చేసింది. చరిత్రలో నిలిచిపోయే స్థాయి బాంబు దాడులు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.

ప్రభుత్వం ఆదేశాల మేరకు సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన దాడులు చేసినట్టు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇరాన్‌కి కౌన్ గా భావించే ఖర్గ్ ఐలాండ్‌లో ప్రతీ సైనిక స్థావరాన్ని పూర్తిగా తుడిచిపెట్టామని రాసుకొచ్చారు. ప్రస్తుతానికి ఈ ద్వీపంలో చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోకూడదని తాను ఎంచుకున్నట్లు తెలిపారు.

Advertisement

ఖర్గ్ ఐలాండ్‌పై వరుసగా బాంబు దాడులు.. ట్రంప్ ప్రకటన

అందుకు కారణాలు కూడా చెప్పారు. అమెరికా ఆయుధాల ముందు ఇరాన్ రక్షణ వ్యవస్థలు నిలవలేవన్నారు. తమ దాడులను అడ్డుకునే శక్తి ఆ దేశానికి లేదన్నారు. ఇకనైనా ఇరాన్ వెనక్కి తగ్గి తమ దేశాన్ని కాపాడుకోవాలని సూచన చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని నిర్మించలేదన్నారు. అమెరికాను బెదిరించే శక్తిని ఆ దేశానికి లేకుండా చేస్తామని చెప్పకనే చెప్పారు.

తాము దాడి చేస్తే రక్షించే సామర్థ్యం ఇరాన్‌కు లేదని కుండబద్దలు కొట్టేశారు. చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గల్ఫ్‌లో హార్ముజ్ జలసంధి ద్వారా ట్యాంకర్లకు అమెరికా నౌకా విభాగం ఎప్పుడు ఎస్కార్ట్ ఇస్తుందని మీడియా ప్రశ్నించింది. అది త్వరలో జరుగుతుందని చెప్పేశారు. ఖర్గ్ ఐలాండ్ ఇరాన్ కు చాలా కీలకమైంది.

ALSO READ: ఒమెన్ పై ఇరాన్ డ్రోన్ దాడి.. ఇద్దరు భారతీయులు మృతి.. 10 మందికి గాయాలు

అది కేవలం ద్వీపం మాత్రమేకాదు ఇరాన్ చమురు ఎగుమతుల్లో దాదాపు 96 శాతం ఇక్కడి నుంచి జరుగుతాయి. ఖర్గ్ ఐలాండ్ అమెరికా దాడి హెచ్చరిక కాదని, ఆ దేశ ఆర్థిక మూలాలను తన గుప్పిట్లోకి తీసుకోవడమేనని నిపుణుల అంచనా. ఈ ప్రాంతంపై పట్టు సాధించడం ద్వారా ఇరాన్ చర్చలకు తీసుకురావడమే అమెరికా ప్రధాన వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు.

 

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×