E-Paper
Advertisement

ట్రంప్ కొత్త సుంకాలు.. 60 దేశాలపై ప్రభావం, మరి ఇండియా మాటేంటి?

ట్రంప్ కొత్త సుంకాలు.. 60 దేశాలపై ప్రభావం, మరి ఇండియా మాటేంటి?
Advertisement

Trump Tariffs: ఏదో విధంగా తమ దేశ ఖనాజాను నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాజాగా వెట్టి చాకిరీ పేరుతో భారత్ సహా 60 దేశాల నుంచి వచ్చే దిగుమతులపై కొత్త సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటన చేశారు. కొత్త టారిఫ్‌లు 10 శాతం నుంచి 12.5 శాతం వరకు ఉండనున్నాయి. దాని ప్రభావం భారత్ పై ఎంతమేరా చూపనుంది.

ట్రంప్ మళ్లీ టారిఫ్-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. వెట్టి చాకిరీతో తయారు చేసిన వస్తువుల దిగుమతులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయా హక్కులు ఉల్లంఘన కింద భారత్‌తోపాటు 60 దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు కొత్త సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

60 దేశాలపై ప్రభావం- గతంలో విధించిన 10 శాతం గ్లోబల్ టారిఫ్‌ల గడువు శుక్రవారంతో ముగియనుంది. దీంతో ట్రేడ్ యాక్ట్ 1974 లోని సెక్షన్- 301 ప్రకారం కొత్త సుంకాలను అమల్లోకి తెచ్చారు. తొలుత భారత్‌పై 12.5 శాతం టారిఫ్ విధించాలని ప్రతిపాదన వచ్చింది. వెట్టి చాకిరీ నిరోధక చట్టాలను భారత్ వేగంగా అమలు చేయడంతో పన్ను 10 శాతానికి తగ్గించారు.

ఈసారి వెట్టి చారికి పేరుతో సుంకాలు- ట్రంప్ విధించిన కొత్త పన్నుల పరిధిలోకి భారత్, చైనా, యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలు వచ్చాయి. చట్టబద్ధంగా వెట్టిచాకిరీ నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేస్తున్న- అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్న కెనడా, బ్రిటన్, ఈయూ, భారత్ వంటి దేశాలకు 10 శాతం సుంకం విధిస్తున్నట్లు యూఎస్  అధికారులు తెలిపారు.

Advertisement

భారత్ తోపాటు కొన్ని దేశాలకు 10 శాతం- అదే సమయంలో వెట్టిచారికి నిరోధించే చట్టాలను కఠినంగా అమలు చేయలేని యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, స్విట్జర్లాండ్ నుండి వచ్చే కొన్ని ఉత్పత్తులపై 10 నుంచి 12.5 శాతం వరకు ​​సుంకం విధించబడుతుంది.  ప్రత్యేక సుంకాలు ఎదుర్కొంటున్న ఉక్కు, అల్యూమినియం వంటి  రంగాలకు మినహాయింపు లభించినట్లయ్యింది.

ALSO READ: షాకింగ్ వీడియో.. చైనాలో గాల్లో కొట్టుకుపోయిన కారు, భయానకంగా మారిన వీధులు!

అర్జెంటీనా, బంగ్లాదేశ్, బ్రిటన్, కంబోడియా, కెనడా, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా, హోండురాస్, ఇండియా, ఇండోనేషియా, జోర్డాన్, మలేషియా, మెక్సికో, పాకిస్తాన్, శ్రీలంక, ట్రినిడాడ్, టొబాగో నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 10 శాతం సుంకం విధించబడుతుంది. చమురు, గ్యాస్, ఎరువులు, కొన్ని ఆహార పదార్థాలు, ఉక్కు, అల్యూమినియం, రాగి, ఆటోమొబైల్స్, యుఎస్-మెక్సికో-కెనడా ఒప్పందం కింద ఉత్పత్తులకు కొత్త సుంకాల నుండి మినహాయింపు ఉంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×