E-Paper
Advertisement

Trump on Iran: చివరి అంకానికి ఇరాన్ యుద్ధం.. ఇస్లామాబాద్‌కు ట్రంప్ వెళ్లే ఛాన్స్, యురేనియం ఇచ్చేందుకు

Trump on Iran: చివరి అంకానికి ఇరాన్ యుద్ధం.. ఇస్లామాబాద్‌కు ట్రంప్ వెళ్లే ఛాన్స్, యురేనియం ఇచ్చేందుకు
Advertisement

Trump on Iran: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం చివరి అంకానికి చేరిందా? ఏడు వారాల తర్వాత పశ్చిమాసియాలో శాంతి నెలకొనబోతుందా? ఇస్లామాబాద్‌ శాంతి చర్చలకు ఈసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెళ్లనున్నారా? యురేనియం నిల్వలను అప్పగించేందుకు ఇరాన్ సిద్ధమైందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

చివరి అంకానికి ఇరాన్ యుద్ధం.. యురేనియం ఇచ్చేందుకు ఇరాన్ గ్రీన్‌సిగ్నల్

Advertisement

ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి అమెరికా రెడీ అయ్యింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వెల్లడించారు. ఇరుపక్షాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయిని తేలిపారు. వారు దాదాపు అన్నింటికీ అంగీకరించారని, ఇక సంతకాలు చేయడానికి ముందుకు రావాలన్నారు.

గురువారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కొన్ని విషయాలు బయటపెట్టారు. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు దగ్గరలో ఉన్నామన్నారు. ఒకవేళ ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరితే తాను ఇస్లామాబాద్ వెళ్తానన్నారు. వాటికి సంబంధించి సంతకాల ప్రక్రియలో తాను పాల్గొంటానని చెప్పేశారు. ఈ నేపథ్యంలో మరొక మాట కూడా చెప్పారు.

Advertisement

ఇస్లామాబాద్‌కు శాంతి చర్చలు, సంతకాల కోసం  ట్రంప్ వెళ్లే ఛాన్స్

ఈ ఒప్పందం జరిగితే హార్మూజ్ జలసంధిని తిరిగి తెరుస్తామన్నారు. చమురు రవాణా స్వేచ్ఛగా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్‌తో కాల్పుల విరమణ అంగీకారం గడువు ఈనెల 22తో ముగియనుంది, అయితే పొడిగించేందుకు తాను సిద్ధమేని సంకేతాలు ఇచ్చారు. నిజానికి ఇస్లామాబాద్ తొలి విడత చర్చలు యురేనియం అప్పగింత విషయంలో విఫలం అయ్యాయి.

యురేనియం శుద్దిని 20 ఏళ్ల వరకు చేయకూడదని అమెరికా పట్టుబట్టింది. ఇరాన్ మాత్రం విద్యుత్ కోసమని, తమ అణు కార్యక్రమాన్నిఐదేళ్లు పాటు నిలిపివేస్తామని ప్రతిపాదించింది.  దీనిపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.  మధ్యమార్గంగా పదేళ్లకు కుదించే అవకాశముందని సమాచారం.

ALSO READ: ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య 10 రోజుల సీజ్‌ఫైర్: డొనాల్డ్ ట్రంప్

యుద్ధానికి పుల్ స్టాప్ పెట్టేందుకు అమెరికా నుంచి శాంతి సందేశాన్ని తీసుకుని టెహ్రాన్ వెళ్లారు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌. ఆదేశ పెద్దలతో చర్చించి శాంతి చర్చలకు ఒప్పించేలా చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య రెండో విడత చర్చలు ఇస్లామాబాద్ వేదికగా జరిగే అవకాశముందని వైట్‌‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. మొత్తానికి ఏడు వారాలుగా ప్రపంచాన్ని వణికించిన చమురు సంక్షోభం, ఇరాన్ యుద్ధ భయానికి తెరపడబోతోంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×