E-Paper
Advertisement

జీసస్ పోలికతో ట్రంప్ ఏఐ పోస్ట్.. పోప్ పై తీవ్ర వ్యాఖ్యలు

జీసస్ పోలికతో ట్రంప్ ఏఐ పోస్ట్.. పోప్ పై తీవ్ర వ్యాఖ్యలు
Advertisement

Trump Jesus Post: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోప్ లియో XIV పై మాటల దాడి చేశారు. క్యాథలిక్ చర్చి అధిపతి పోప్ లియో XIV పొలిటికల్ కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు. వీరి మాటల యుద్ధానికి అసలు కారణం ఇరాన్ యుద్ధం. ఇరాన్ పై యుద్ధానికి దేవుడు ట్రంప్‌ను ఎంచుకున్నాడు. ఈ పాత్రను తాను ఉత్సాహంగా నిర్వహిస్తున్నానన్నారు. “ఇరాన్‌పై యుద్ధంలో దేవుడు అమెరికాకు మద్దతు ఇస్తాడని నేను నమ్ముతున్నాను” అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై పోప్ స్పందించారు.

“రక్తంతో తడిసిన చేతుల” ప్రార్థనలను దేవుడు వినడని పోప్‌ అన్నారు. పోప్ వ్యాఖ్యలపై ట్రంప్ రెచ్చిపోయారు. ఆయన చాలా బలహీన నాయకుడు, చాలా ఉదారవాది అని ఎద్దేవా చేశారు. ఇరాన్‌కు అణ్వాయుధాలు ఉండాలని పోప్ కోరుకుంటున్నారని ఆరోపించారు. అమెరికా ఉన్నతాధికారులు, యుద్ధ విమాన పైలట్లకు ఏసుక్రీస్తు రక్షణగా ఉన్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు. వాటికన్ సిటీ పోప్ పై ట్రంప్ చేసిన ఆరోపణలను ఖండించింది.

పోప్ ఏమన్నారంటే?

Advertisement

పామ్ సండే ప్రసంగంలో పోప్ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రజలపై బెదిరింపులు ఆమోదయోగ్యం కాదన్నారు. యుద్ధం చేసే వారి ప్రార్థనలను దేవుడు వినడు, వాటిని తిరస్కరిస్తాడని పోప్ అన్నారు.

పోప్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ట్రంప్‌ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ లో జీసస్ తరహాలో ఉన్న ఏఐ చిత్రాన్ని పోస్టు చేశారు. ఆ చిత్రంలో ట్రంప్ ఏసుక్రీస్తు పాత్రలో బైబిల్ లో చెప్పిన విధంగా అద్భుతం చేస్తున్నట్లు ఓ పోస్టు పెట్టారు. ట్రంప్ జీసస్ తరహాలో వస్త్రాలు ధరించి ఒక రోగిపై చేయి ఉంచి బాగుచేస్తున్నట్లు ఉంది. ట్రంప్ చేతి వేళ్ల నుంచి కాంతి వెలువడుతుండగా, చూస్తున్నవారు భక్తితో నమస్కరిస్తున్నారు. యేసు లాజరును మృత్యువు నుండి లేపిన బైబిల్ వృత్తాంతాన్ని ఈ చిత్రం చూపుతుంది.

గతంలో కూడా

Advertisement

తాను పోప్‌కు అభిమానిని కానని, ఆయన సరిగ్గా పని చేయడం లేదని ట్రంప్ విమర్శలు చేశారు. అంతేకాకుండా, ఆయన రాడికల్ లెఫ్టిస్టుల పట్ల చాలా సానుభూతితో ఉన్నారని ఆరోపించారు. పోప్ రాజకీయాలు, యూఎస్ విదేశాంగ విషయాలపై కాకుండా, ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ట్రంప్ సూచించారు. ట్రంప్ మతపరమైన చిత్రాలను ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. మే 2025లో తాను పోప్ అవ్వాలనుకుంటున్నానని చమత్కరించారు. ఆ తర్వాత పోప్ వస్త్రధారణలో ఉన్న తన చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టు కూడా ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది.

Also Read: ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌ జలసంధి క్లీనింగ్ మొదలు, ఏం జరిగింది?

ట్రంప్ ఇరాన్ తో ఘర్షణను పవిత్ర యుద్ధంగా చిత్రీకరిస్తున్నారు. అయితే తాజాగా పోప్ పై వ్యాఖ్యలతో క్యాథలిక్కులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మంది క్యాథలిక్కులు ఉన్నారు. వీరిలో సుమారు 7 కోట్ల మంది అమెరికాలో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో క్యాథలిక్కులు ఎలా స్పందిస్తారో చూడాలంటున్నారు నిపుణులు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×