E-Paper
Advertisement

ఈవీ మార్కెట్‌ లో సంచలనం, ఓకే ఛార్జ్ తో 320 కిమీ వెళ్లే ఓలా స్కూటర్ వచ్చేసింది!

ఈవీ మార్కెట్‌ లో సంచలనం, ఓకే ఛార్జ్ తో  320 కిమీ వెళ్లే ఓలా స్కూటర్ వచ్చేసింది!
Advertisement

Ola S1 X+ 5.2 kWh Launched in India: దేశీ మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ మరో కొత్త స్కూటర్‌ ను విడుదల చేసింది. Ola S1 X+ 5.2 kWh పేరుతో వచ్చిన ఈ మోడల్ ప్రస్తుతం ఉన్న టాప్ బ్రాండ్లను తలదన్నబోతోంది. రూ. 1.29 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో వచ్చిన ఈ స్కూటర్ భారీ రేంజ్ అందించబోతోంది. ఈ ధర ప్రత్యేక ఆఫర్‌ గా ఈ నెల మధ్య వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

పూర్తి స్వదేశీ  4680 భారత్ సెల్ బ్యాటరీ వినియోగం

ఈ స్కూటర్‌ లో.. ఓలా పూర్తి దేశీయంగా తయారు చేసిన 4680 భారత్ సెల్ బ్యాటరీ ఉపయోగించింది. ఈ కొత్త టెక్నాలజీ వల్ల స్కూటర్‌ కు మంచి పని తీరు, ఎక్కువ రేంజ్ లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఓలా తన ఉత్పత్తులన్నీ ఒకే చోట తయారు చేసే విధానాన్ని అనుసరిస్తోంది. బ్యాటరీ తయారీ నుంచి వాహనం తయారీ వరకు అన్ని ప్రక్రియలను ఒకే ప్లాట్‌ ఫారమ్‌లో నిర్వహించడం వల్ల ఖర్చు తగ్గి, వినియోగదారులకు తక్కువ ధరలో మంచి ఫీచర్లు అందించగలుగుతోంది.

ఒకే ఛార్జ్ తో 320 కిలో మీటర్ల ప్రయాణం

Advertisement

ఈ స్కూటర్ పవర్ ఫుల్ పని తీరు కనబర్చనుంది. ఇందులో 11 kW మిడ్ డ్రైవ్ మోటార్ అమర్చారు. దీని సాయంతో  ఒకసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 320 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. ఇది ఈ సెగ్మెంట్‌లో చాలా మంచి రేంజ్‌ గా భావించవచ్చు. అలాగే గరిష్ట వేగం గంటకు 125 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

అదరిపోయే భద్రతా ఫీచర్లు

భద్రత, కంట్రోల్ విషయంలో కూడా ఈ స్కూటర్‌లో మంచి ఫీచర్లు ఉన్నాయి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ తో పాటు బ్రేక్ బై వైర్ టెక్నాలజీ ఉంది. ఇది రైడింగ్ సమయంలో మంచి స్థిరత్వాన్ని అందిస్తుంది. ఈ మోడల్ ఓలా జెన్ 3 ప్లాట్‌ ఫారమ్‌ పై రూపొందించబడింది. ఇప్పటికే ఈ ప్లాట్‌ ఫారమ్‌పై పలు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

కొత్తగా 5.2 kWh వేరియంట్

ఇప్పటికే మార్కెట్లో ఉన్న S1 Pro, S1 Pro+ వంటి మోడళ్లతో పాటు S1 X సిరీస్‌లో 2 kWh, 3 kWh, 4 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 5.2 kWh వేరియంట్ అందుబాటులోకి వచ్చింది. రేంజ్, పనితీరు ఆధారంగా వారికి సరిపోయే మోడల్‌ను ఎంచుకునే అవకాశం పెరిగింది.

ఈవీ బైక్స్ పైనా ఓలా ఎలక్ట్రిక్ ఫోకస్

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు ఎలక్ట్రిక్ బైక్స్ పైనా దృష్టి పెడుతోంది. రోడ్‌స్టర్ సిరీస్ ద్వారా మార్కెట్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తంగాఓలా S1 X+ 5.2 kWh మంచి రేంజ్, వేగం, ఆధునిక టెక్నాలజీతో మాస్ మార్కెట్‌ లో మంచి పోటీని ఇవ్వబోతోంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి ఇదో బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: ఫ్రంట్‌ లైన్ ఆపరేషన్లలో ఎలక్ట్రిక్ బైక్‌లు.. భారత సైన్యం కొత్త ప్లాన్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×