E-Paper
Advertisement

Can Men Get Pregnant: “మగాళ్లు గర్భం దాల్చగలరా?”.. అమెరికా సెనేట్‌లో భారత సంతతి డాక్టర్‌పై సెనేటర్ ప్రశ్నల వర్షం!

Can Men Get Pregnant: “మగాళ్లు గర్భం దాల్చగలరా?”.. అమెరికా సెనేట్‌లో భారత సంతతి డాక్టర్‌పై సెనేటర్ ప్రశ్నల వర్షం!
Advertisement

Can Men Get Pregnant: మగవారు గర్భం దాల్చగలరా? అంటే.. ఎవ‌రైనా ఏం స‌మాధానం చెబుతారు. సాధార‌ణంగా లేదు అని స‌మాధానం ఎక్కువ శాతం మంది చెబుతారు. కానీ అమెరికాలో ఓ పెద్ద చ‌ర్చే జ‌రిగింది. అమెరికా సెనేట్ కమిటీ విచారణలో భాగంగా భారత సంతతికి చెందిన వైద్యురాలు డాక్టర్ నిషా వర్మకు, రిపబ్లికన్ సెనేటర్ జోష్ హాలీకి మధ్య జరిగిన తీవ్ర‌మైన చ‌ర్చ‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “మగవారు గర్భం దాల్చగలరా?” అని సెనేటర్ అడిగిన ప్రశ్నకు ఆమె నేరుగా సమాధానం చెప్పకపోవడమే ఈ చర్చకు కారణమైంది.

అమెరికాలో గర్భస్రావం మందుల (Abortion Drugs) భద్రతపై జరుగుతున్న ఒక కమిటీ విచారణలో డాక్టర్ నిషా వర్మ సాక్ష్యమిచ్చారు. ఈ మందులు దశాబ్దాలుగా సురక్షితంగా ఉన్నాయని ఆమె వాదించారు. అయితే, మధ్యలో సెనేట‌ర్ జోష్ హాలీ ఆమెను అడ్డుకుంటూ.. మగవారు గర్భం దాల్చగలరా? అని ఒక సూటి ప్రశ్న వేశారు.

Advertisement

ఈ ప్రశ్నకు అవును.. కాదు అని ఏం సమాధానం చెప్పకుండా ఆమె కొంత తడబడ్డారు. “నేను మహిళలుగా గుర్తించబడని అనేక రకాల వ్యక్తులకు వైద్యం అందిస్తాను. నా దగ్గరకు వచ్చే రోగులు రకరకాల జెండర్ ఐడెంటిటీలు కలిగి ఉంటారు” అని ఆమె బదులిచ్చారు. ఆమె చెప్పిన స‌మాధానాన్ని హాలీ తప్పుబట్టారు. ఇది ఒక జీవశాస్త్ర వాస్తవం (Biological Reality) అని, సైన్స్ గురించి మాట్లాడే వైద్యురాలు దీనికి సమాధానం చెప్పలేకపోవడం విడ్డూరమని ఆయన విమర్శించారు.

“మీరు సైన్స్, సాక్ష్యాల గురించి మాట్లాడుతున్నారు కదా.. మరి ఆధారాల ప్రకారం మగవారు గర్భం దాల్చగలరా? ఇది అవును లేదా కాదు అని చెప్పాల్సిన ప్రశ్న” అని హాలీ పట్టుబట్టారు. దానికి నిషా వర్మ స్పందిస్తూ.. “ఇటువంటి అవును లేదా కాదు అనే ప్రశ్నలు రాజకీయ సాధనాలుగా మారుతున్నాయి. సమాజంలో ఇవి విభజనను పెంచుతాయి.” అని త‌ప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు.

Advertisement

దీనిపై హాలీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. “మహిళలు మాత్రమే గర్భం దాల్చుతారు. మగవారు కాదు అన్నది ప్రాథమిక సత్యం. ఈ కనీస వాస్తవాన్ని కూడా గుర్తించని మిమ్మల్ని మేము సైంటిస్ట్ అని ఎలా నమ్మాలి? మీ సమాధానం పట్ల నాకు ఆశ్చర్యం కలుగుతోంది.” అని ఎద్దేవా చేసేలా వ్యాఖ్యానించారు. మహిళల రక్షణ కోసం జరుగుతున్న ఈ విచారణలో, మహిళలకు మగవారికి తేడా తెలియకపోవడం విచారకరమని ఆయన ముగించారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×