E-Paper
Advertisement

Russia nuclear Weapons: ‘ఇక యుద్ధంలో రష్యా అణు ఆయుధాలు ఉపయోగిస్తుంది’.. పాశ్చాత్య దేశాలకు పుతిన్ వార్నింగ్!

Russia nuclear Weapons: ‘ఇక యుద్ధంలో రష్యా అణు ఆయుధాలు ఉపయోగిస్తుంది’.. పాశ్చాత్య దేశాలకు పుతిన్ వార్నింగ్!
Advertisement

Russia nuclear Weapons| రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం జరిగిన సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ లో మాట్లాడుతూ.. తమ దేశంపై ఏదైనా అణు ఆయుధాలు కలిగిన దేశం దాడి చేసినా లేక యుద్ధంలో యుక్రెయిన్ కు సాయం చేసినా తాము ఇక అణుఆయుధాలు ప్రయోగిస్తామని హెచ్చరించారు. అణు ఆయుధాలు ప్రయోగించేందుకు తమ న్యూక్లియర్ పాలసీలో మార్పులు కూడా చేయబోతున్నామని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ అణు ఆయుధాలు కలిగిన రష్యా ప్రెసిడెంట్ ఇలాంటి ప్రకటన చేయడంతో ప్రపంచ దేశాలన్నీ సీరియస్ అయ్యాయి.

”ఏదైనా న్యూ క్లియర్ ఆయుధాలు లేని దేశం.. అణు శక్తి కలిగిన మరో దేశం సాయంతో రష్యాపై దాడి చేస్తే.. అది రష్యా సార్వభౌమత్వం సంయుక్త దాడి చేసినట్లే భావిస్తాం. న్యూ క్లియర్ ఆయుధాలు ఉపయోగించేందుకు రష్యా ముందస్తుగానే నియమాలు పాటిస్తోంది. కానీ ఏదైనా అణు శక్తి కలిగిన దేశం సాయం రష్యా భూభాగంపై మిస్సైల్స్, డ్రోన్స్ తో దాడి చేస్తే.. ఆ సమయంలో రష్యా అణు ఆయుధాలు ప్రయోగిస్తుంది.” అని పుతిన్ మీటింగ్ లో తీవ్ర స్వరంతో చెప్పారు.

Advertisement

రష్యా లేదా బెలారూస్ (రష్యా మిత్రదేశం) పై ఆధునిక టక్నాలజీ కలిగిన క్షిపణులతో ఇతర దేశాలు దాడి చేస్తే.. ప్రతి దాడిలో అణు ఆయుధాలుతో దాడి చేసే అధికారం తమకు ఉందని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా బ్రిటన్, అమెరికా.. ఆధునిక స్టార్మ్ షాడో మిస్సైల్స్ ని ఉక్రెయిన్ ను సరఫరా చేస్తున్నాయి. ఇప్పటికే ఈ మిస్సైల్స్ తో ఉక్రెయిన్ దాడులు చేసిందని సమాచారం. దీంతో రష్యా అణు దాడి చేస్తామని పాశ్చాత్య దేశాలకు వార్నింగ్ ఇచ్చింది.

రష్యా-ఉక్రెయిన్ వార్
2.5 సంవత్సరాలుగా జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఇరువైపులూ తీవ్ర నష్టం జరిగింది. అయితే గత రెండు నెలలుగా ఈ యుద్ధంలో పాశ్చాత్య దేశాలు.. ఉక్రెయిన్ కు భారీ స్థాయిలో ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలిదిమిర్ జెలెన్‌స్కీ.. యుద్ధంలో తమకు సాయం చేస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రెంచ్ దేశాలకు ఆధునిక క్షిపణులైన ఎటిఎసిఎంఎస్, బ్రిటీష్ స్టార్మ్ షాడో లను రష్యాపై ప్రయోగించేందుకు అనుమతులు పొందారు.

Advertisement

Also Read: 1951లో పిల్లాడు కిడ్నాప్.. 70 ఏళ్ల తరువాత గుర్తుపట్టిన ఫ్యామిలీ..

రష్యా, అమెరికా దేశాల వద్ద ప్రపంచంలోని 88 శాతం అణు ఆయుధాలు ఉన్నాయి. దీంతో ఈ రెండు దేశాలు యుద్ధంలో తలపడితే ప్రపంచ వినాశనానికి దారితీసే అవకాశముంది. 1962 క్యూబా యుద్ధంలో అమెరికాకు వ్యతిరేకంగా క్యూబాకు రష్యా సాయం చేసింది. ఆ సమయంలో దాదాపు ఇరు దేశాలు ముఖాముఖి పోరు తలపడబోయే పరిస్థితి వచ్చినా.. ఆ తరువాత సద్దమణిగింది. కానీ మళ్లీ ఇన్నేళ్లకు ఆ పరిస్థితి దాపురించడంతో ప్రపంచదేశాల నాయకులు ఆందోళన చెందుతున్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×