E-Paper
Advertisement

Rahul Gandhi: అందుకే ఉగ్రవాదులు నన్నేం చేయలేదు: రాహుల్ గాంధీ

Rahul Gandhi: అందుకే ఉగ్రవాదులు నన్నేం  చేయలేదు: రాహుల్ గాంధీ
Advertisement

Rahul Gandhi: జమ్మూకశ్మీర్‌లో భారత్ జోడో యాత్ర చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు తనను చంపేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వచ్చానన్న ఒకే ఒక్క కారణంతో తనను వాళ్లు ఏం చేయలేదని తెలిపారు. లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో 21వ శతాబ్దంలో లెర్నింగ్ టు లిజన్ అనే టాపిక్‌పై మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘జమ్ముకశ్మీర్‌లోకి ఎంటర్ అవ్వగానే ఉగ్రవాదుల ముప్పు ఉందని, యాత్రను విరమించుకోవాలని భద్రతా సిబ్బంది నాకు చెప్పారు. అయినా కూడా నేను ముందుకే సాగాలని నిర్ణయించుకున్నా. అలా యాత్ర సాగుతున్న సమయంలో ఓ వ్యక్తి నాతో మాట్లాడేందుకు వచ్చాడు. నిజంగా ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి వచ్చారా? అని ప్రశ్నించాడు. కాసేపటికి దగ్గర్లో ఉన్న కొంత మందిని చూపిస్తూ.. వారు ఉగ్రవాదులు అని చెప్పి వెళ్లిపోయాడు.

Advertisement

వెంటనే నేను షాక్ అయ్యాను. సమస్యల్లో ఉన్నానేమో అనిపించింది. వాళ్లు నన్ను చంపేసేవారే.. కానీ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చానన్న ఒకే ఒక్క కారణంతో నాపై దాడి చేయలేదు. అది లిజనింగ్‌కు ఉన్న శక్తి’’ అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×