E-Paper
Advertisement

Russia Population | మహిళలు 8 మంది పిల్లలను కనాలి.. రష్యా జనాభా పెంచాలి : పుతిన్

Russia Population | మహిళలు ఎక్కువమంది పిల్లలను కని దేశ జనాభా పెంచాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. రష్యాలో పెద్ద కుటంబాల సంప్రదాయం తీసుకురావాలని.. అందుకోసం మహిళలు 8 మంది లేదా అంతకంటే ఎక్కువ పిల్లలను కనాలని పుతిన్ వ్యాఖ్యానించారు.

Russia Population | మహిళలు 8 మంది పిల్లలను కనాలి.. రష్యా జనాభా పెంచాలి : పుతిన్
Advertisement

Russia Population | మహిళలు ఎక్కువమంది పిల్లలను కని దేశ జనాభా పెంచాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. రష్యాలో పెద్ద కుటంబాల సంప్రదాయం తీసుకురావాలని.. అందుకోసం మహిళలు 8 మంది లేదా అంతకంటే ఎక్కువ పిల్లలను కనాలని పుతిన్ వ్యాఖ్యానించారు. ఇటీవల ‘వరల్డ్‌ రష్యన్‌ పీపుల్స్‌’ కౌన్సిల్‌ సమావేశం రష్యా రాజధాని మాస్కోలో జరిగింది.

ఈ సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. “రష్యాలో గత 30 సంవత్సరాలుగా జననాల రేటు పడిపోతోంది. మరోవైపు ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల భారీగా ప్రాణ నష్టం జరిగింది. పాత తరం మహిళలు నలుగురు, అయిదుగురు పిల్లలను కనడం వల్లనే రష్యా సమాజం బలంగా ఉంది. మన అమ్మమ్మలు ఎనిమిది, పది మంది పిల్లలు కనేవారు. ఈ సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. పెద్ద కుటుంబాలు దేశంలో ప్రామాణికంగా నిలవాలి. ప్రపంచంలో రష్యాని బలమైన దేశంగా నిలబెట్టాలి. ఇందుకోసం భవిష్యత్తు తరాలు రష్యా జనాభాను పెంచాలి,” అని పుతిన్‌ అన్నారు.

Advertisement

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×