// // Pakistan Elections Results 2024 | పాకిస్థాన్‌లో సంకీర్ణ సర్కార్ .. పీఎంఎల్, పీపీపీ మధ్య సయోధ్య! -->
E-Paper
Advertisement

Pakistan Elections: పాకిస్థాన్‌లో సంకీర్ణ సర్కార్.. పీఎంఎల్, పీపీపీ మధ్య సయోధ్య!

Pakistan Elections: పాకిస్థాన్‌లో సంకీర్ణ సర్కార్.. పీఎంఎల్, పీపీపీ మధ్య సయోధ్య!
Advertisement

Pakistan Election Results 2024: పాకిస్థాన్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ లభించలేదు. ఆ దేశంలో 265 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ నేతృత్వంలో పాకిస్థాన్ తెహ్రీక్- ఇ-ఇన్సాఫ్ ( పీటీఐ) మద్దతు పోటీ చేసిన ఇండిపెండెట్స్ 101 చోట్లు గెలిచారు. నవాజ్ షరీఫ్ చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్ (పీఎంఎల్-ఎన్) 75 స్థానాల్లో విజయం సాధించింది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 54 సీట్లు కైవసం చేసుకుంది.

పాకిస్థాన్ లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పీఎంఎల్-ఎన్, పీపీపీ పార్టీలు సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, మాజీ మంత్రి బిలావల్ భుట్టోలు చేతులు కలిపారు. మరోవైపు పాకిస్థాన్ సైన్యం మద్దతు నవాజ్ షరీఫ్ కే ఉంది.

Advertisement

నవాజ్ షరీఫ్‌ సారథ్యంలోని పీఎంఎల్‌-ఎన్‌, బిలావల్‌ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పీపీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఇరుపార్టీల మధ్య అంగీకారం కూడా కుదిరింది. అధికారం పంపకంపై కీలక ప్రతిపాదనలు జరిగాయి.

పీపీపీ అధ్యక్షుడు బిలావల్‌ భుట్టో జర్దారీకి ప్రధాని పదవి ఇవ్వాలని ఆ పార్టీకి చెందిన నేతలు పట్టుబడుతున్నారు. అలాగే ప్రధాని పదవిని పీఎంఎల్‌-ఎన్‌ కు మూడేళ్లు, పీపీపీ రెండేళ్లు పంచుకోవాలనే చర్చలు నడుస్తున్నాయి. పాకిస్థాన్ లోని ప్రావిన్సుల్లోనూ రెండు పార్టీల సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×