E-Paper
Advertisement

Pakistan: అమెరికా వీసా వ్యవహారం.. తొలిసారి రియాక్టయిన పాకిస్తాన్, ఆదేశంతో సంప్రదింపులు మొదలు

Pakistan: అమెరికా వీసా వ్యవహారం.. తొలిసారి రియాక్టయిన పాకిస్తాన్, ఆదేశంతో సంప్రదింపులు మొదలు
Advertisement

Pakistan: అమెరికాకు వలస వచ్చేవారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా ఏ మాత్రం పట్టించుకోలేదు. తాము తీసుకొచ్చిన పాలసీని అములు చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో 75 దేశాలకు చెందిన పౌరులకు సంబంధించి వీసా ప్రాసెస్‌ని నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. అందులో పాకిస్తాన్ కూడా ఉంది. ఈ వ్యవహారంపై పాక్ పాలకులు రియాక్ట్ అయ్యారు.

అమెరికా వీసా వ్యవహారం.. పాక్ తొలిసారి రియాక్ట్

Advertisement

వలసదారులను తగ్గించుకునే పనిలో పడింది అమెరికా. ఈ క్రమంలో ఆదేశానికి వెళ్లేవారిపై కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. విద్యార్థుల నుంచి అన్ని విభాగాలను ఫోకస్ చేసింది. మరో కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా. పాక్, బంగ్లా, నేపాల్ సహా మొత్తం 75 దేశాల పౌరులకు తమ దేశం వీసా ప్రాసెసింగ్‌ని నిలిపి వేయనున్నట్లు ప్రకటన చేసింది.

అంతేకాదు యూఎస్ ప్రభుత్వ పథకాలపై వారు ఎక్కువగా ఆధారపడినట్టు తెలుస్తోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఏఖంగా 75 దేశాల వ్యక్తులు అధికంగా సంక్షేమ ఫలాలు పొందుతున్నారని భావించింది. అందువల్లే ఆయా దేశాల ఇమ్మిగ్రెంట్‌ వీసా ప్రాసెసింగ్‌ను నిలిపి వేయాలని డిసైడ్ అయినట్టు పేర్కొంది.

Advertisement

త్వరగా పునఃప్రారంభం అవుతుందని ఆశిస్తున్నాం-పాక్

వారంతా మాకు భారంగా మారినట్టు నిర్ధారణ అయ్యేంత వరకు నిలిపివేత అమల్లో ఉంటుందని చెప్పకనే చెప్పింది. అమెరికా చేసిన ప్రకటన జనవరి 21 నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అందులో పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, అఫ్గానిస్థాన్, బ్రెజిల్, ఈజిప్టు, ఇరాన్, ఇరాక్‌ వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.

ఈ విషయంలో అమెరికా ప్రకటన తొలిసారి స్పందించింది పాకిస్థాన్. ఆ దేశం నుంచి ప్రతీ ఏటా వేలాది మంది అమెరికాకు వెళ్తున్నారు. అక్కడే సెటిలవుతున్నారు. ఈ విషయంలో అక్కడి కొన్నివర్గాల నుంచి ఒత్తిడి తీవ్రమైంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తాహిర్ మాట్లాడారు. వాషింగ్టన్ నుండి తాము స్పష్టత కోరుతున్నామని, వీసా పునరుద్దరణ త్వరగా పునఃప్రారంభం అవుతుందని అన్నారు.

ALSO READ: ఇరాన్‌లో రక్తపాతం.. ఇప్పటివరకు  3,400 మందిపైగానే మృతి

మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ఆదేశ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపారు. సేవలను పునరుద్ధరించడానికి ఎలాంటి సమయం ఇవ్వనప్పటికీ, తాత్కాలికమేనని అంచనా వేసినట్టు ఆయన తెలిపారు. అమెరికా వలస విధానాలు, వారి అంతర్గత సమీక్ష ప్రక్రియని తాము అర్థం చేసుకున్నట్లు తెలిపారు. వీసా సస్పెన్షన్ వల్ల ఏటా అమెరికా వీసాల కోసం వేలాది మంది పాకిస్తానీయుల చదువు, ఉపాధి ప్రణాళికలను దెబ్బ తీస్తుందని అంటున్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×