E-Paper
Advertisement

Pakistan Air strikes: పాకిస్థాన్ వైమానిక దాడులు.. 28 మంది మృతి, దాడులతో రగిలిపోతున్న తాలిబన్లు

Pakistan Air strikes: పాకిస్థాన్ వైమానిక దాడులు.. 28 మంది మృతి, దాడులతో రగిలిపోతున్న తాలిబన్లు
Advertisement

Pakistan Air strikes: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య చిచ్చు రేగిందా? సరిహద్దు ప్రాంతాలలో వైమానిక దాడులకు పాకిస్థాన్ దిగడంతో ఆగ్రహంతో తాలిబన్లు రగిలిపోతున్నారా? దెబ్బకు దెబ్బ తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారా? ఇంతకీ పాక్ వైమానిక దాడుల వెనుక అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

ఆప్గాన్‌లో పాకిస్థాన్ వైమానిక దాడులు.. 28 మంది మృతి

Advertisement

ఈ మధ్యకాలంలో జరిగిన ఆత్మాహుతి దాడులకు తెహ్రిక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్ గ్రూప్ కారణమని భావిస్తోంది పాకిస్థాన్‌. ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆదివారం తెల్లవారుజామున వైమానిక దాడులకు దిగింది. ముఖ్యంగా ఆఫ్గాన్ తూర్పు ప్రాంతంలో ఈ దాడులకు దిగినట్టు తెలుస్తోంది. ఈ దాడుల్లో దాదాపు 28 మంది తెహ్రిక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్ గ్రూప్ సభ్యులు మరణించినట్టు తెలుస్తోంది.

ఇస్లామాబాద్ వైమానిక దాడులకు సంబంధించి ఖచ్చితమైన ప్రదేశాలను వెల్లడించలేదు. పాకిస్తాన్ మీడియా సంస్థల ప్రకారం.. సమాచార మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ ఆదేశ వైమానిక దళాలు ఫిట్నా అల్ ఖ్వారిజ్, డేష్ ఖోరాసన్ ప్రావిన్స్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నాయి.

Advertisement

దాడులతో రగిలిపోతున్న తాలిబన్లు, ప్రతీకారం తీర్చుకుంటాం

రంజాన్ సందర్భంగా ఇస్లామాబాద్, బజౌర్, బన్నుల్లో జరిగిన ఆత్మాహుతి దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్య అని పాకిస్థాన్ సైనిక వర్గాలు చెబుతున్నాయి. ఆత్మాహుతి దాడులు ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న నాయకత్వం ఆదేశాల మేరకు జరిగాయని ఆ మంత్రిత్వ శాఖ ఆరోపించింది.  ఆదివారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్థాన్ తూర్పు ప్రాంతంలో వైమానిక దాడులు జరిగాయి.

డ్యూరాండ్ లైన్ వెంబడి అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది పాకిస్థాన్. తూర్పు, ఆగ్నేయ ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతంలో నిర్వహించిన ఈ దాడుల్లో కనీసం 28 మంది టిటిపి సభ్యులు మరణించారని పాక్ సైనిక వర్గాలు నిర్ధారించాయి. ఈ దాడుల వల్ల అపారమైన ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది. పాకిస్తాన్ వైమానిక దళం F-16 ఫైటర్ జెట్‌, JF-17 థండర్ విమానాలను ఉపయోగించినట్టు తెలుస్తోంది.

ALSO READ: ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్.. గుట్టు విప్పేస్తా, డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం

ఆఫ్ఘన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని దాడులకు పాకిస్థాన్ దిగిందని తాలిబన్ వర్గాలు ఆరోపించాయి. ఆఫ్ఘన్ గగనతలాన్ని ఉల్లంఘించిందని, ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతున్నాయి. తాము సరైన సమయంలో తిరిగి దాడి చేస్తామని చెప్పాయి. దాడుల తర్వాత సీనియర్ తాలిబన్ నాయకులు కాబూల్, కాందహార్‌లలో ముఖ్యమైన సమావేశాలను ఏర్పాటు చేసినట్టు సమాచారం. పాకిస్తాన్ ఇప్పటికే ఒప్పందాలను ఉల్లంఘించిందని తాలిబన్లు ఆరోపించారు. ఈ విషయాన్ని సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ సహా మధ్యవర్తుల దేశాలకు తెలియజేసినట్టు తాలిబన్ వర్గాలు పేర్కొన్నాయి.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×