E-Paper
Advertisement

Earthquake: అర్ధరాత్రి భారీ భూకంపం.. చిగురుటాకులా వణికిన ఇండోనేషియా, 7.4గా నమోదు

Earthquake: అర్ధరాత్రి భారీ భూకంపం.. చిగురుటాకులా వణికిన ఇండోనేషియా, 7.4గా నమోదు
Advertisement

Earthquake: అర్ధరాత్రి భారీ భూకంపం ఇండోనేషియాని వణికించింది. ప్రకృతి వైపరీత్యం వల్ల అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. మరి కొన్ని దారుణంగా దెబ్బతిన్నాయి. అయితే ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సివుంది. భారీగా వణికించడంతో ప్రజలు మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఇండోనేషియా ప్రభుత్వం ప్రజలకు సూచన చేసింది.

ఇండోనేషియాని వణికించిన భారీ భూకంపం

ఇండోనేషియాలో సంభవించింది భూకంపం రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైనట్టు యుఎస్ జియోలాజికల్ సర్వే విభాగం తెలిపింది. ఈశాన్యంగా ఉన్న మొలుక్కా సముద్ర ప్రాంతంలో 7.4 తీవ్రతతో శక్తి వంతమైన భూకంపం సంభవించినట్టు తెలిపింది. బుధవారం అర్థరాత్రి ధాటిన తర్వాత సంభవించిన భూకంపం 35 కిలోమీటర్ల లోతులో సంభవించింది.

Advertisement

ఇండోనేషియాలోని టెర్నాటేకు 127 కిలోమీటర్ల పశ్చిమ-వాయువ్యంగా ఉందని తెలిపింది. టెర్నాటే నగర జనాభా దాదాపు 2 లక్షల మంది. సుగంధ ద్రవ్యాలకు కేరాఫ్‌గా చెబుతారు.  ఈ దీవిలో  తీవ్రత  7 కు పైగా నమోదు రావడంతో పొరుగు దేశాలలో సునామీ అలలు సంభవించే అవకాశం ఉందని అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ తెలిపింది.

రిక్టర్ స్కేలుపై 7.4 గా నమోదు.. భారీగా ఆస్తి నష్టం

ఈ భూకంపం సముద్ర మట్టానికి తక్కువ లోతులో సంభవించడంతో సముద్రపు అలలు ఎగిసిపడే అవకాశముందని భావించిన ఇండోనేషియా వాతావరణ సంస్థ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఇండోనేషియాలోని సుమిత్రా దీపుల ప్రాంతాల ప్రజలను అధికారులు ఎత్తైన ప్రదేశాలకు తరలించారు.

Advertisement

అటు మలేషియా, ఫిలిప్పీన్స్ దేశాలు అలర్టయ్యాయి. 28 కోట్ల మందికి పైగా జనాభా కలిగిన విశాలమైన ద్వీప సమూహం ఇండోనేషియా. పసిఫిక్ బేసిన్‌లోని అగ్నిపర్వతాలు, ఫాల్ట్ లైన్‌ల వలయమైన రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉండడంతో తరచుగా భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాల బారిన పడుతుంది. నాలుగేళ్ల కిందట అంటే 2022లో పశ్చిమ జావాలోని సియాంజుర్ నగరంలో సంభవించిన భూకంపం 602 మందిని బలిగొంది.

ALSO READ:  అన్నంత ప‌ని చేసింది.. బహ్రెయిన్ లో AWS డేటా సెంట‌ర్ పై ఇరాన్ దాడి

2004 డిసెంబర్‌లో హిందూ మహాసముద్రంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం కారణంగా డజను దేశాల్లో 230,000 మందికి పైగా మరణించారు. వీరిలో ఎక్కువ మంది ఇండోనేషియాలోని ఆచే ప్రావిన్స్‌కు చెందినవారు ఉన్నారు. 2018లో సులవేసిలో సంభవించి భూకంపంలో 4,300 మందికి పైగా మరణించారు. భూకంపం-సునామీ తర్వాత ఇండోనేషియాలో అత్యంత ఘోరమైన భూకంపం ఇదే.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×