E-Paper
Advertisement

Israel Attacks : ఇస్లామిక్ వర్సిటీ నేలమట్టం

Israel Attacks : ఇస్లామిక్ వర్సిటీ నేలమట్టం
Advertisement
Israel Attacks

Israel Attacks : ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు నిర్విరామంగా రొద పెడుతున్నాయి. గాజా, దాని పరిసరాలను లక్ష్యంగా చేసుకుని బాంబులు కురిపిస్తున్నాయి. గాజా సరిహద్దుల ప్రాంతాలను తిరిగి తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.

గాజా సిటీలోని ఇస్లామిక్ యూనివర్సిటీని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) నేలమట్టం చేసింది. హమాస్ మిలిటెంట్ల కార్యకలాపాలకు అది కేంద్రమని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి వెల్లడించారు. అక్కడ ఆయుధాల తయారీయే కాకుండా.. సైనిక నిఘా శిక్షణ కూడా కొనసాగుతోందని ఆరోపించింది. గాజా, గాజా కారిడార్, లెబనాన్, సిరియా, వెస్ట్ బ్యాంక్‌లో మిలిటెంట్లతో తాము పోరాడుతున్నామని బ్రిగేడియర్ జనరల్ డేనియల్ హగారీ తెలిపారు.

Advertisement

సిరియా నుంచి దాడులు తక్కువగా ఉన్నా.. లెబనాన్‌లోని హెజ్బుల్లా మిలిటెంట్ల నుంచి దాడులు పెరిగాయి. దీనికి ఐడీఎఫ్ ధీటుగానే జవాబిచ్చింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ నుంచి గగనతల దాడులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. హమాస్ టాప్ లీడర్లను తుదముట్టించాలనేది ఐడీఎఫ్ లక్ష్యంగా కనిపిస్తోంది.

హమాస్ మెరుపు దాడి అనంతరం ఇప్పటివరకు 155 మంది సైనికులు సహా 1200 మంది ఇజ్రాయెలీలు మరణించారు. గాజాలో 900 మంది మృతి చెందారు. వారిలో హమాస్ మిలిటెంట్లు కూడా ఉన్నారని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇక హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాకు ఆహారం, ఫ్యూయల్, మందుల సరఫరాను ఇజ్రాయెల్ నిలిపివేసింది. ఈ పోరు కారణంగా 2.6 లక్షల మంది గాజా‌స్ట్రిప్‌ను వీడినట్టు ఐక్యరాజ్యసమితి తెలిపింది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×