E-Paper
Advertisement

ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ.. ఖోమ్‌ సిటీలో ట్రీట్‌మెంట్, ఆ ప్రాంతంపై అమెరికా-ఇజ్రాయెల్ దేశాల నిఘా

ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ.. ఖోమ్‌ సిటీలో ట్రీట్‌మెంట్, ఆ ప్రాంతంపై అమెరికా-ఇజ్రాయెల్ దేశాల నిఘా
Advertisement

Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం మొజ్తబా ఖమేనీ గురించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆయన ట్రీట్‌మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. జరుగుతున్న యుద్ధం గురించి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇజ్రాయెల్-అమెరికా నిఘా వర్గాలకు సమాచారం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి.

ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ గురించి కొత్త విషయం

Advertisement

ఇరాన్ సుప్రీం మోజ్తాబా ఖమేనీ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. యుద్ధం తొలిరోజు నుంచి ఆయన బయటకు కనిపించడం మానేశారు. రెండుసార్లు ఆడియో సందేశాలు, ఓసారి ఆయనకు సంబంధించి ఏఐ వీడియో వెలుగులోకి వచ్చింది అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం మోజ్తాబా ఖమేనీ ప్రస్తుతం ఖోమ్ సిటీలో చికిత్స పొందుతున్నారన్నది దాని సారాంశం.

మోజ్తాబా ఖమేనీ అపస్మారక స్థితిలో ఉన్నారని, తీవ్ర అనారోగ్యంతో ఉండడం వల్ల నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉన్నారని చెబుతున్నాయి. ఇంతకీ ఖోమ్ సిటీ ఎక్కడ ఉంది. ఇరాన్ సుప్రీం నివాస స్థానం వెల్లడి కావడం ఇదే మొదటిసారి. టెహ్రాన్‌కు దక్షిణంగా సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఖోమ్ సిటీ ఉంది. ఈ నగరం షియాలు పవిత్రమైన ప్రాంతంగా భావిస్తారు. ఇస్లామిక్ రిపబ్లిక్ మతపరమైన రాజధానిగా దాన్ని పిలుస్తారు.

Advertisement

ఖోమ్‌లో ట్రీట్‌మెంట్.. ఆ సిటీలో తండ్రి అంత్యక్రియలకు సన్నాహాలు

సుప్రీం లీడర్ ఆచూకీ గురించిన సమాచారం అమెరికా-ఇజ్రాయెల్ గూఢచార సంస్థలకు నిఘా పెట్టాయి. వాటి గురించి సమాచారం తెలిసినప్పటికీ బహిరంగ పరచలేదని తెలుస్తోంది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో హతమైన అయితుల్లా అలీ ఖమేనీ పార్థివ దేహాన్ని షియా మత కేంద్రం ఖోమ్‌లో ఖననం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఖోమ్‌లో ఒకటి కంటే ఎక్కువ సమాధుల కోసం పెద్ద సమాధి మందిరాన్ని నిర్మించడానికి పునాదులు వేస్తున్నారనే సమాచారం నిఘా వర్గాల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అయితుల్లా ఖమేనీతో పాటు కుటుంబసభ్యులను ఖననం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వార్తలపై వాషింగ్టన్ గానీ, టెహ్రాన్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

ALSO READ: పనామా బ్రిడ్జిపై భారీ పేలుడు.. పలువురికి తీవ్రగాయాలు, ఉలిక్కిపడిన అమెరికా, ఎవరి పని?

సోమవారం ఇరాన్ సుప్రీం మోజ్తాబా ఖమేనీ నడుచుకుంటూ వార్ రూమ్‌లోకి వెళ్లిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దక్షిణ ఇజ్రాయెల్‌లోని డిమోనాలో అణు విద్యుత్ కేంద్రం పటాన్ని విశ్లేషిస్తున్నట్లుగా ఏఐ రూపొందించిన వీడియోను టెహ్రాన్ విడుదల చేసిందని సమాచారం. ప్రస్తుతం యుద్ధాన్ని ఇరాన్ రివెల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తమ చేతుల్లోకి తీసుకుంది. వివిధ విభాగాలకు చెందిన కీలక నేతలు హతం కావడంతో తర్వాత వారిని ఆయా స్థానాల్లో నియమిస్తున్నట్లు తెలుస్తోంది.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×