E-Paper
Advertisement

తక్కువ బరువు, మరింత పవర్.. కొత్త ఎలక్ట్రిక్ KTM వచ్చేసింది!

తక్కువ బరువు, మరింత పవర్.. కొత్త ఎలక్ట్రిక్ KTM వచ్చేసింది!
Advertisement

New KTM Electric Bike 2027:  KTM ఫ్రీరైడ్ E మోడల్‌ ను మరింత అద్భుతంగా రూపొందించింది. ఈ ఎలక్ట్రిక్ ఆఫ్ రోడ్ బైక్ ఇప్పటికే మార్కెట్‌ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు కొత్త అప్‌ డేట్ల తో ఇది మరింత క్రేజీగా ఆకట్టుకుంటుంది. ఈ బైక్ ను యూరప్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని  తయారు చేసినప్పటికీ, భవిష్యత్తులో భారత్ లోకి అడుగు పెట్టనుంది.

సింఫుల్ కంట్రోల్..

ఫ్రీరైడ్ E పూర్తిగా ఎలక్ట్రిక్ బైక్ కావడం వల్ల సైలెంట్ గా పని చేస్తుంది. సాధారణ పెట్రోల్ డర్ట్ బైక్‌ లతో పోలిస్తే ఇది తక్కువ సౌండ్ చేస్తుంది, వేడి తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. ఆఫ్ రోడ్ రైడింగ్‌ లో కొత్తగా ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే దీన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది.

మరింత పవర్ ఫుల్ గా..

Advertisement

ఈ కొత్త మోడల్‌ లో పవర్ కూడా పెరిగింది. గరిష్టంగా 25.5 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే 37 Nm టార్క్ అందించడం వల్ల రైడింగ్ స్మూత్‌ గా ఉంటుంది. ఎలక్ట్రిక్ బైక్ కావడంతో పవర్ డెలివరీ వెంటనే లభిస్తుంది. రైడర్ అవసరాన్ని బట్టి ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌ అందుబాటులో ఉన్నాయి. అదనంగా, ఎనర్జీ రీజెనరేషన్ కూడా మూడు లెవెల్స్ లో ఉండటం వల్ల బ్యాటరీ యూసేజ్ ను కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది.

గంటలకు 95 కిలో మీటర్ల వేగం..

ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 95 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇందులో 5.5 kWh సామర్థ్యంతో కూడిన కొత్త లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే, రైడింగ్ స్టైల్‌ను బట్టి 2 నుండి 3 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా, ఈ బ్యాటరీని మార్చుకునే సౌకర్యం ఉండటం వల్ల రైడింగ్ మధ్యలో ఎక్కువ టైమ్ వేస్ట్ కాకుండా చూసుకోవచ్చు. ఛార్జింగ్ విషయంలో కూడా ఇది చాలా ఫ్లెక్సిబుల్‌ గా ఉంది. సాధారణ 660W ఛార్జర్‌ తో పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 8 గంటలు పడుతుంది. కానీ, ఫాస్ట్ 3.3kW ఛార్జర్ ఉపయోగిస్తే కేవలం 1.5 గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ 1,000 కంటే ఎక్కువ ఛార్జింగ్ సైకిళ్లను తట్టుకుంటుంది. అంటే, దీర్ఘకాలికంగా ఉపయోగించవచ్చు.

జస్ట్ 112 కేజీల బరువు

Advertisement

బరువు పరంగా చూస్తే, ఈ బైక్ కేవలం 112 కిలోలే ఉంటుంది. తేలికగా ఉండటం వల్ల గుంతలు ఉన్న మార్గాల్లో కూడా సులభంగా నడపవచ్చు. కొత్త రైడర్లు కూడా ఈ బైక్‌ను కంఫర్ట్‌ గా హ్యాండిల్ చేస్తారు.  2027 KTM ఫ్రీరైడ్ E లేటెస్ట్, తేలికైన, సులభంగా ఉపయోగించగల ఎలక్ట్రిక్ ఆఫ్ రోడ్ బైక్ గా గుర్తింపు తెచ్చుకోనుంది. ఇది భవిష్యత్తులో ఎలక్ట్రిక్ రైడింగ్‌ కు మైల్ స్టోన్ గా నిలువనుంది.

Read Also: మారుతి సుజుకి కళ్లు చెదిరే ఆఫర్లు, ఆ కార్లపై ఏకంగా రూ. 2.6 లక్షల తగ్గింపు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×