E-Paper
Advertisement

ఇరాన్‌పై అమెరికా భీకరదాడులు.. హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్, మళ్లీ ప్రపంచ దేశాలు చమురు కష్టాలు

ఇరాన్‌పై అమెరికా భీకరదాడులు.. హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్, మళ్లీ ప్రపంచ దేశాలు చమురు కష్టాలు
Advertisement

Iran Vs America: ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ యుద్ధం తీవ్రమైంది. రాత్రి దక్షిణ ఇరాన్‌పై మిస్సైళ్లు, బాంబులతో విరుచుకుప‌డుతోంది అమెరికా. ముఖ్యంగా డెహ్రాన్, సిరిక్, మినాబ్, బందర్ అబ్బాస్ ప్రాంతాలపై ఎడతెరిపి లేకుండా బాంబుల వర్షం కురిపించింది. పరిస్థితి గమనించిన ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ జలసంధిని మూసి వేసినట్టు ప్రకటన చేసింది.

ఇరాన్‌పై అమెరికా దాడులు.. హార్ముజ్ జలసంధిని మూసేసిన ఇరాన్

Advertisement

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చింది. ఇరాన్‌పై అమెరికా సైన్యం దాడులు తీవ్రతరం చేసింది. రాత్రి నుంచి టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఇరాన్‌లోని కీలక లక్ష్యాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. ఇరాన్‌ చర్యలకు నిరసనగా ఈ దాడులు చేస్తున్నట్లు వెల్లడించింది అమెరికా సైన్యం.

రానున్న రోజుల్లో ఇరాన్‌పై మరిన్ని దాడులు చేస్తామని చెప్పిన అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన చేసిన క్షణాల వ్యవధిలో దాడులు చోటు చేసుకున్నాయి. దీంతో పశ్చిమాసియాలో మార్చి నాటి పరిస్థితి నెలకొంది. ఇదిలావుండగా అమెరికా దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

మళ్లీ ప్రపంచ దేశాలు చమురు కష్టాలు

ప్రపంచ రవాణకు కీలకంగా మారింది హర్మూజ్ జలసంధి. దీన్ని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటన చేసింది. దీంతో ఆ మార్గం ద్వారా ప్రయాణించే నౌకలను లక్ష్యంగా దాడులు చేసుకుంటామని తేల్చి చెప్పేసింది.  ప్రకటన తర్వాత  హోర్ముజ్ జలసంధి ద్వారా అక్రమంగా వెళ్ళడానికి ప్రయత్నించిన రెండు నౌకలను కూల్చి వేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘించిన నేపథ్యంలో  తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు హోర్ముజ్ జలసంధిని మూసి వేస్తామని పేర్కొంది. ఇరాన్ తీసుకున్న నిర్ణయంతో మళ్లీ గల్ఫ్‌లో యుద్ధ వాతావరణం మొదలైంది.

ALSO READ: పీఓకేలో తీవ్ర విషాదం.. కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్.. 21 మంది సైనికులు మృతి!

వెంటనే పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలో ఏ నౌక తన లంగరును విడిచి వెళ్లకూడదని ఐఆర్జీసీ హెచ్చరించింది. హోర్ముజ్ జలసంధిని సమీపించడం శత్రువుతో చేతులు కలిపినట్టుగా తాము భావిస్తామని తేల్చిచెప్పింది.  ఈ విషయాన్ని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ స్వయంగా వెల్లడించింది.  ఫలితంగా  ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై ఆందోళన తీవ్రమవుతున్నాయి.

హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేతతో ఈ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీనికి ప్రతీకారంగా దక్షిణ ఇరాన్‌లోని రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో టెలికాం టవర్, మంచి నీటి ట్యాంకులు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. అమెరికా నిర్ణయంతో తమ దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఇరాన్ మీడియా పేర్కొంది.

మరోవైపు ఆసియా దేశాలకు మళ్లీ చమురు కష్టాలు మొదలుకానున్నాయి.  ఓవైపు ఇరాన్.. మరో అమెరికా బలగాలు జలసంధి చుట్టూ మకాం వేశాయి. జలసంధి దాటి నౌకలు బయటకు వచ్చే అవకాశం లేదు. దీంతో  జపాన్ మొదలు పాకిస్థాన్ వరకు చమురు కష్టాలు రెట్టింపు కానున్నట్లు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.

 

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×