E-Paper
Advertisement

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. హిందూ యువకుడి సజీవ దహనం, ప్లాన్ ప్రకారమేనన్న ఫ్యామిలీ

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. హిందూ యువకుడి సజీవ దహనం, ప్లాన్ ప్రకారమేనన్న ఫ్యామిలీ
Advertisement

Bangladesh: బంగ్లాదేశ్‌‌లో మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. షాపులో నిద్రిస్తున్న ఓ హిందూ యువకుడ్ని సజీవ దహనం చేశాయి అల్లరి మూకలు. ఈ ఘటన నార్సింగ్డి ప్రాంతంలో జరిగింది. షట్టర్‌ మూసి వేసి పెట్రోల్‌ పోసి నిప్పు అంటించినట్టు అక్కడి మీడియా చెబుతోంది. ప్లాన్ ప్రకారం చేశారని అంటున్నారు మృతి కుటుంబసభ్యులు.

బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. మరో హిందూ యువకుడి సజీవ దహనం 

Advertisement

బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఏ మాత్రం తగ్గుముఖం పట్టలేదు. అక్కడ చాలా ప్రాంతాలు ఇప్పటికే రావణకాష్టంలా మారుతూనే ఉన్నాయి. అక్కడి ప్రజల అంతర్గత కలహాలు కాస్త హిందువులపైకి మళ్లాయి.  ఒంటరిగా హిందూ యువకులు కనిపిస్తే చాలు చంపేసి దహనం చేయడం, సజీవంగా దహనం చేస్తున్నారు ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా మరో హిందూ యువకుడిపై పెట్రోల్ పోసి తగులబెట్టాయి అల్లరిమూకలు.

శుక్రవారం రాత్రి బంగ్లాదేశ్‌లోని నార్సింగ్డిలో దారుణమైన ఘటన జరిగింది. ఓ షాపుపై అల్లరి మూకలు దాడి చేసి బీభత్సం సృష్టించాయి. ఈ సమయంలో షాపులో నిద్రిస్తున్నాడు చంచల్‌ భౌమిక్‌ అనే యువకుడు. షట్టర్‌ మూసి వేసి పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టారు అల్లరి మూకలు. ఈ ఘటనలో చంచల్‌ సజీవదహనమయ్యాడు. చంచల్‌ మరణించిన తర్వాత దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Advertisement

పథకం ప్రకారమే చంచల్‌ హత్య చేసినట్లు అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చంచల్‌కి తల్లి, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఒకరు దివ్యాంగుడు కాగా, అతడి తండ్రి చాలా కాలం రోజుల కిందట మరణించాడు. చంచల్‌ ఆదాయంపై ఆ కుటుంబం జీవనం సాగిస్తోంది. కుటుంబ కోసం నార్సింగ్డి ప్రాంతంలో ఓ గ్యారేజీలో ఆరేళ్లుగా పని చేస్తున్నాడు.గ్యారేజ్ యజమానితో చంచల్‌ను ఎలాంటి శత్రుత్వం లేదు.

ప్లాన్ ప్రకారమేనన్న చేశారన్న బాధిత ఫ్యామిలీ

చంచల్ పొరుగువారు కావడంతో ముందస్తు ప్రణాళికతో హత్యకు జరిగిందని అంటున్నారు. గతంలో దీపు చంద్రదాస్‌, ఖోకొన్‌ చంద్రదాస్‌‌లను ఈ విధంగా అల్లరి మూకలు హత్య చేశాయి. ఈ ఘటన తర్వాత అక్కడి హిందువుల్లో భయం నెలకొంది. 15 లేదా నెల రోజుల కొకసారి హిందువులను దహనం చేయడంపై ప్రతీ క్షణం ఏం జరుగుతుందోనన్న భయం అక్కడివారిని వెంటాడుతోంది.

బంగ్లాదేశ్‌లో పరిస్థితులు రెండేళ్లుగా నివురుగప్పిన నిప్పులా మారుతున్నాయి. సుమారు 17 కోట్ల జనాభా కలిగిన బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత నెలకొంది. అక్కడి పరిస్థితులు రోజు రోజుకూ ఆందోళనకరంగా మారుతున్నాయి. మైనారిటీలైన హిందువులపై ముస్లింలోని కొన్ని వర్గాలు దాడులు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మత పరమైన హింస చెలరేగడంతో బంగ్లాదేశ్ హిందూ-బౌద్ధ-క్రిస్టియన్ ఐక్యతా మండలి ఆందోళన వ్యక్తం చేసింది కూడా.

ALSO READ: అమెరికాలోని మినియాపాలిస్‌లో హింసాత్మక నిరసనలు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు

డిసెంబర్ 31న షరియత్‌పూర్ జిల్లాలో హిందూ వ్యాపారి ఖోకోన్ దాస్‌పై ఓ గుంపు దాడి చేసి నిప్పు పెట్టింది. ఈ ఘటనలో సజీవదహన మయ్యాడు. మందుల షాపు యజమాని దాస్‌ను ఇంటికి తిరిగి వస్తుండగా కత్తితో పొడిచి ఆపై పెట్రోల్ పోసి దహనం చేశారు. అంతకుముందు వస్త్ర పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుడు చంద్ర దాస్‌ను కొట్టి చంపి నిప్పంటించిన విషయం తెల్సిందే.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×