E-Paper
Advertisement

నిప్పులు కాదండోయ్.. ఈ అగ్నిపర్వతం కురిపించేది అచ్చమైన బంగారం.. ఎక్కడుందో తెలుసా?

నిప్పులు కాదండోయ్.. ఈ అగ్నిపర్వతం కురిపించేది అచ్చమైన బంగారం.. ఎక్కడుందో తెలుసా?
Advertisement

Gold volcano: అగ్నిపర్వతం అనగానే మనకు గుర్తొచ్చేది ఉప్పొంగే లావా, దట్టమైన పొగ, ప్రాణాలు తీసే విషవాయువులు. కానీ ఈ భూమ్మీద ఒక వింతైన అగ్నిపర్వతం మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఏటా కోట్ల రూపాయల విలువైన స్వచ్ఛమైన బంగారాన్ని గాల్లోకి వెదజల్లుతోంది. అంటార్కిటికాలోని మంచు ఖండంలో దాగున్న ఈ ప్రకృతి వింత శాస్త్రవేత్తలను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

మంచు కొండల్లో మండుతున్న లావా సరస్సు..
ప్రపంచంలోనే అత్యంత దక్షిణాన, అంటార్కిటికాలోని ‘రాస్ ఐలాండ్’ లో కొలువై ఉన్న ‘మౌంట్ ఎరెబస్’ (Mount Erebus) ఒక సజీవ అగ్నిపర్వతం. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ఎప్పుడూ మరిగిపోయే ఒక లావా సరస్సు ఉంటుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. ఈ పర్వతం నుండి ప్రతిరోజూ దాదాపు 80 గ్రాముల అచ్చమైన బంగారం సూక్ష్మ కణాల (గోల్డ్ డస్ట్) రూపంలో బయటకు వస్తోంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం లెక్కిస్తే దీని విలువ రోజుకు సుమారు రూ. 5.6 లక్షలు కాగా, ఏడాదికి దాదాపు రూ. 19 కోట్ల పైమాటే!

Advertisement

వేల కిలోమీటర్లు ప్రయాణించే ‘బంగారు ధూళి’
ఇలా వెలువడే బంగారం మనం నగలు చేయించుకునేలా గడ్డలుగా ఉండదు. ఇవి కంటికి కనిపించనంత సూక్ష్మంగా, కేవలం 20 నుండి 60 మైక్రాన్ల పరిమాణంలో ఉండే స్ఫటికాలు. (ఒక మీటరును పది లక్షల భాగాలు చేస్తే వచ్చేదే ఒక మైక్రాన్). అగ్నిపర్వతం నుండి వచ్చే వాయువులతో కలిసి ఈ బంగారు రేణువులు గాల్లో తేలుతూ ఏకంగా వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తాయి. చివరికి అంటార్కిటికా తెల్లటి మంచు పొరలపై పడి కలిసిపోతాయి. అత్యంత సూక్ష్మంగా, మంచులో కలిసిపోవడం వల్లే దీన్ని సేకరించడం ఎవరికీ సాధ్యపడటం లేదు.

ముప్పై ఏళ్లుగా వీడని ‘గోల్డ్ మిస్టరీ’
నిజానికి హవాయిలోని కిలౌయా, ఇటలీలోని ఎట్నా వంటి అగ్నిపర్వతాల వద్ద కూడా ఇలాంటి బంగారు ఆనవాళ్లు కనిపించినా, మౌంట్ ఎరెబస్ స్థాయిలో ఎక్కడా లేదు. భూగర్భంలోని విపరీతమైన వేడికి బంగారం కరిగి, వాయువులతో కలిసి పైకి వస్తుందని కొందరు చెప్తుంటే.. లావా సరస్సు ఉపరితలంపైనే ఈ ప్రక్రియ జరుగుతుందని మరికొందరు భావిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నా, ఈ అగ్నిపర్వతం ఇంతలా బంగారం ఎలా కురిపిస్తోందనే రహస్యం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పూర్తిస్థాయిలో అంతుచిక్కడం లేదు.

Advertisement

Also Read: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. భారీ పేలుడుతో కుప్పకూలిన ఓ ఇల్లు.. స్పాట్‌లో!

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×