// // Taiwan EarthQuake: తైవా‌న్ ని కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.0 గా నమోదు -->
E-Paper
Advertisement

EarthQuake: తైవా‌న్ ని కుదిపేసిన భూకంపం.. కుప్పకూలిన భారీ భవనాలు, 7.0 గా నమోదు

EarthQuake: తైవా‌న్ ని కుదిపేసిన భూకంపం.. కుప్పకూలిన భారీ భవనాలు, 7.0 గా నమోదు
Advertisement

Earth Quake: తైవాన్‌‌‌ని భారీ భూకంపం వణికించింది. శనివారం రాత్రి 11 గంటలకు సంభవించింది. తైవాన్‌లోని ఈశాన్య తీరప్రాంత నగరమైన యిలాన్ లో 7.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని అక్కడి వాతావరణ కేంద్రం తెలిపింది. భూకంపం ధాటికి రాజధాని తైపీలో భారీ ఎత్తైన భవనాలు కుప్పకూలిపోయాయి.

తైవా‌న్ ని కుదిపేసిన భూకంపం

Advertisement

కౌంటీ హాల్‌కు దూరంలో అంటే 72.8 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. భారీ భూకంపం నేపథ్యంలో రాజధాని తైపీలో భవనాలు ఊగిపోయాయని, పలు చోట్ల కూలినట్లు అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ పరిణామంతో భయపడిన ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.

తైవాన్ అగ్నిమాపక సంస్థ.. జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తోంది. బుధవారం 6.0 తీవ్రతతో సంభవించింది భూకంపం. ఆ ద్వీపాన్ని తాకిన రెండవ అతిపెద్ద భూకంపం ఇది. తైవాన్ ప్రాంతం రెండు టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ దగ్గర ఉండడంతో ఆ ప్రాంతం తరచూ భూకంపాలకు గురయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Advertisement

కుప్పకూలిన భారీ భవనాలు, 7.0 గా నమోదు

ప్రపంచంలో అత్యంత భూకంప క్రియాశీల జోన్‌గా ఈ ప్రాంతాన్ని వర్ణిస్తారు శాస్త్రవేత్తలు. 1999 ఏడాదిలో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత ఆ ద్వీపాన్ని తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇది. అప్పట్లో వచ్చిన భూకంపం తైవాన్ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యం.

అందులో 2 వేల మందికి పైగా మరణించారు. 2016లో దక్షిణ తైవాన్‌లో సంభవించిన భూకంపంలో 100 మందికి పైగా మరణించారు. ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని అక్కడి వాతావరణ కేంద్రం చెప్పింది. వరుసగా భూకంపాలు రావడంతో తైవాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ALSO READ: 6 వేల నాటి చూయింగ్ గమ్.. బయటపడిన ఆది మానవుడి రహస్యాలు

యిలాన్‌లో 3,000 కంటే ఎక్కువ ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తైవాన్ పవర్ కంపెనీ వెల్లడించింది. రాబోయే రోజుల్లో 5 నుంచి 6 తీవ్రతతో భూకంపాలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది.

భూకంపం చాలా లోతుగా ఉండటంతో ఆఫ్‌షోర్‌ను తాకినందున నష్టాన్ని పరిమితం చేయాలని పేర్కొంది. మరోవైపు తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-టే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పరిస్థితిని అదుపులో ఉందని, భూకంపాల పట్ల జనాభా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×