E-Paper
Advertisement

Dirty Man : డర్టీ మ్యాన్ “అమౌ హజీ” ఇక లేరు..

Dirty Man : డర్టీ మ్యాన్ “అమౌ హజీ” ఇక లేరు..
Advertisement

Dirty Man : ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా గుర్తింపు పొందిన అమౌ హజీ.. 94ఏళ్ల వయసులో మృతి చెందారు. ఇరాన్‌లోని డెగాహ్ గ్రామంలో అమౌ హజీ గత 60 ఏళ్లుగా స్నానం చేయకుండా అలాగే ఉన్నారు. స్నానం చేస్తే ఆరోగ్యం పాడవుతుందనేది ఆయన నమ్మకం. దీంతో ఆయన టెహ్రాన్‌లోనే డెగాహ్ గ్రామంలో ఓ గుడిసెలో స్నానం చేయకుండా అలాగే ఉన్నారు.

అమో హజీపై 2013లో “ద స్ట్రేంజ్ లైఫ్ ఆఫ్ అమౌ హజీ” అనే డాక్యుమెంటరీ రిలీజ్ అయింది. అమౌ హజీకి గతంలో స్నానం చేయించడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. స్నానం చేయించడానికి వెహికల్‌లో తరలిస్తుంటే వెంటనే దాంట్లో నుంచి బయటకి దూకేసాడు. అమో హజీకి వైద్యులు ఎన్ని మెడికల్ పరీక్షలు చేసినా నెగిటివ్‌గా తేలింది. హెచ్‌ఐవీ, హెపటైటిస్ పరీక్షలు చేసినా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. వీధుల్లో చనిపోయిన మృగజీవాల మాంసాన్నే ఆహారంగా తీసుకుంటాడు అమో హజీ.. దీంతో ఆయన బాడీలో ట్రైకినోసిన్ అనే బ్యాక్టీరియా ఉన్నట్లు వైద్యులు కనుగ్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత మురికైన వ్యక్తిగా రికార్డ్ కొట్టినప్పటికీ మరణించడంతో ఇప్పుడా స్థానాన్ని భారత్‌కు చెందిన “కలౌ” దక్కించుకున్నాడు. ఈయన వారణాసి శివారులో ఉంటున్న సాధువు.. 30 ఏళ్లుగా స్నానం చేయలేదు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×