E-Paper
Advertisement

Muslims Protect Temple: బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయం రక్షించేందుకు ముస్లింల పోరాటం.. పూజారి ఏమన్నారంటే

Muslims Protect Temple: బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయం రక్షించేందుకు ముస్లింల పోరాటం.. పూజారి ఏమన్నారంటే
Advertisement

Bangladesh Muslims Protect Temple| బంగ్లాదేశ్ల్ లో ప్రధాన మంత్రి షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తరువాత.. దేశంలోని హిందువులపై, హిందూ దేవాలయాలపై అల్లరి మూకలు దాడులు చేశాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లోని పురాతన ఢాకేశ్వరి దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చిన అల్లరి మూకలను స్థానిక హిందువులు, ముస్లింలు అడ్డుకున్నారు.

ఆ ప్రదేశంలో ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో దేవాలయాన్ని సులువుగా కూలదోయొచ్చని భావించిన మతోన్మాద యువకులతో స్థానిక ముస్లింలు పోరాడారు. హిందూ- ముస్లిం ఐక్యతకు నిదర్శనకు ప్రతీకగా ఉన్న ఈ దేవాలయాన్ని తాము కాపాడుకుంటామని గుడి పూజారికి స్థానిక ముస్లింలు హామీ ఇచ్చినట్లు పూజారి తెలిపారు.

Advertisement

ఈ ఘటన గురించి ఢాకేశ్వరి గుళ్లో పనిచేసే పూజారి ఆషిమ్ మైత్రో వివరించారు. ”ఢాకేశ్వరి మందిరం చుట్టూ చాలా మసీదులన్నాయి. ఎన్నో దశాబ్దాల నుంచి మసీదు నుంచి వచ్చే అజాన్ పిలుపుతో పాటు దేవాలయ పూజార్చనల ధ్వనుల శబ్దాలు మనశ్శాంతినిస్తున్నాయి. ఈ ప్రాంతంలో హిందూ ముస్లింలు చాలా స్నేహ పూర్వకంగా నివసిస్తున్నారు. ఆ ఢాకేశ్వరి తల్లి సమస్త మానవాళికి తల్లి. ఆ రోజు దేవాలయాన్ని నాశనం చేయడానికి చాలామంది ఉద్రేక యువత వచ్చినప్పుడు వారిని అడ్డుకనేందుకు స్థానికంగా నివసించే హిందువులు, ముస్లింలు అందరూ కలిసి పోరాడారు. ముఖ్యంగా ముస్లిం సోదరులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. వారు ఆ రోజు లేకపోతే దేవాలయంలో వినాశనం సృష్టించేందుకు అల్లరి మూకలు సిద్ధంగా కనిపించాయి. నేను భయంతో ఆ తల్లిని వేడుకుంటూ ఉండిపోయాను. అల్లరి మూకలు.. స్థానికుల నుంచి వ్యతిరేకత చూసి తిరిగి వెళ్లిపోయారు.” అని పూజారి చెప్పారు.

Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!

Advertisement

బంగ్లాదేశ్ లో ప్రస్తుతం నోబెల్ అవార్డు గ్రహీత మొహమ్మద్ యూనుస్ నాయకత్వంలో ఒక ఆపధర్మ ప్రభుత్వం ఏర్పడింది. నిజానికి దేశంలో మిలిటరీ పాలన నడుస్తున్నా.. పరిపాలనా బాధ్యతలు యూనుస్ ఆధ్వర్యంలో సాగుతున్నాయి. హిందూ దేవాలయాలకు సంరక్షన కల్పిస్తామని, హిందువులు, మైనారిటీలను కాపాడుతామని యూనుస్ ఇటీవల ప్రకటించిన తరువాత.. పరిస్థితి మెరుగుపడింది.

గత రెండు నెలలుగా బంగ్లాదేశ్ లో హింసాత్మక నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన మంత్రి షేక్ హసీనాని బలపూర్వకంగా ఆమె పదవి నుంచి తప్పంచి.. మిలిటరీ పాలన కొనసాగుతోంది. ప్రస్తుతం దేవాలయాలు, చర్చిల లో నిత్యపూజలు, ప్రార్థనలు పున:ప్రారంభమయ్యాయి. మరి కొన్ని రోజుల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఎటువంటి హింసాత్మక ఘటనలు జరుగకుండా ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు కల్పిసామని హామీ ఇచ్చింది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×