E-Paper
Advertisement

Amazon: మళ్లీ ఉద్యోగులను తొలగించే యోచనలో అమెజాన్.. ఈసారి ఎంత మంది అంటే..?

Amazon: మళ్లీ ఉద్యోగులను తొలగించే యోచనలో అమెజాన్.. ఈసారి ఎంత మంది అంటే..?
Advertisement

Amazon: ఆర్థికమాంద్యం భయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. చిన్న కంపెనీల నుంచి దిగ్గజ కంపెనీల వరకు అన్నీ కుదేలవుతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. ఉన్న ఉద్యోగులు కూడా జాబ్ ఉంటుందో .. లేదో అని ఆందోళనకు గురవుతున్నారు. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇటీవలే పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. తాజాగా మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది.

ఆర్థికమాంద్యం పెరుగుతుండడంతో అమెజాన్ త్వరలో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించే యోచనలో ఉందట. దాదాపు 9 వేల మందిని తొలగించేందుకు సన్నాహాలు చేస్తుందట. ట్విచ్, అమెజాన్ అడ్వటైజింగ్, ఏడబ్ల్యూఎస్ విభాగాలకు చెందిన ఉద్యోగులను తొలగించనుందట. ఇక ఈ లేఆఫ్స్‌కు సంబంధించి ఇప్పటికే అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ ఉద్యోగులకు మెయిల్ పంపించారట. ‘‘ఉద్యోగులను తొలగించడం కష్టంతో కూడుకున్నది. కానీ సంస్థ దీర్ఘకాలిక విజయాలు సాధించాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు’’ అని మెయిల్‌లో పేర్కొన్నారట.

Advertisement

ఈఏడాది జనవరిలోనే అమెజాన్ 18వేల మంది ఉద్యోగులను ఇళ్లకు సాగనంపింది. మళ్లీ రెండు నెలలకే 9 వేలమందిని తొలగించేందుకు సన్నాహాలు చేస్తుండడంతో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×