E-Paper
Advertisement

Graduation at 90 : 90 ఏళ్ల వయసులో డిగ్రీ.. మనవడితో కలిసి గ్రాడ్యుయేషన్ పట్టా..

Graduation at 90 : 90 ఏళ్ల వయసులో డిగ్రీ.. మనవడితో కలిసి గ్రాడ్యుయేషన్ పట్టా..
Advertisement

Graduation at 90 : తల్లిదండ్రులు అన్ని సదుపాయాలు కల్పించి చదువుకోమని చెప్పినా కొంత మంది విద్యార్థులు చదవుకునేందుకు బద్ధకిస్తారు. మరి కొందరికి కుటుంబ పరిస్థితులు అనుకూలించక.. ఆర్థిక స్తోమత లేక చదువుకు దూరమవుతారు. వయసు పైబడితే చదువలేమన్న భావన పెరుగుతుంది. కానీ అనుకున్నది సాధించాలన్న కోరిక మనిషిని ఎంత దూరం అయిన తీసుకెళుతుంది. వయసుతో సంబధం లేకుండా మనిషిని కష్టపడేలా చేస్తుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచింది 90 ఏళ్ల బామ్మ. తొమ్మిది పదుల వయసులో మనవళ్లు, మనవరాళ్లతో సమయాన్ని వృథా చేయకుండా.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. మనవడితో కలిసి డిగ్రీ పట్టా అందుకుంది.

యూఎస్ కి చెందిన ఓ బామ్మ 90 ఏళ్ల వయసులో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది. ఆమె తల్లిదండ్రులు వస్త్ర కార్మికులు కావడంతో మిల్లు వాతావరణంలో పెరిగింది. 1950లో హైస్కూల్ విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమెకు పరిస్థితులు అనుకులించక చదవలేక పోయింది.

Advertisement

ఓ జునియార్ కళాశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. ఆ తర్వాత ఆమె రియల్ ఎస్టేట్ సంస్థలో క్లర్క్ గా పనిచేసింది.1961 లో డేల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. పిల్లలు పుట్టాక వారి ఆలనా పాలన చూసుకుంటూ కొన్నాళ్లు ఇంట్లోనే ఉండిపోయింది. పిల్లలు ఎదిగిన తర్వాత తన కెరియర్ ని మళ్ళీ ప్రారంభించింది.

30 ఏళ్లు ట్రాన్స్క్రిప్షనిస్ట్ వర్డ్ ప్రాసెసర్ గా పని చేసింది. 68 ఏళ్ల వయసులో విరమణ తీసుకుంది. రిటైర్మెంట్ తర్వాత ఇంటి వద్దే ఉన్న తాను.. మళ్లీ చదువుకోవాలని భావించింది. అవశ్యమే టెక్సాస్ ఉమెన్స్ యూనివర్సిటీలో చేరింది. అండర్ గ్రాడ్యుయేట్ లో జర్నలిజం, బిజినెస్ కోర్సు లను తీసుకుంది. 73వ ఏట గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

Advertisement

అత్యంత వృద్ధ వయసులో పీజీ చేసిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. తన మనవడితో కలిసి డిగ్రీ పట్టాను అందుకుంది. తన తోటి విద్యార్థులు బామ్మని అభిమానించేవారు. ఆమెను చూసి ఎంతో స్పూర్తి పొందేవారు. అన్ని వసతులు ఉండి.. చదువుకునే అవకాశం ఉన్నా.. సమయం వృథా చేసే వారికి ఈ బామ్మ ఉదాహరణగా నిలిచింది.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×