// //
Director Trinadha Rao Nakkina Father Passed Away: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. త్రినాధరావు నక్కిన తండ్రి సూర్యారావు మృతి చెందారు. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గతరాత్రి కన్నుమూసినట్లు తెలుస్తోంది. దీంతో డైరెక్టర్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. రేపు అనకాపల్లిలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇక ఈ విషయం తెలియడంతో హీరో సందీప్ కిషన్, నిర్మాత రాజేష్ దండా రేపు అనకాపల్లి వెళ్లనున్నారు. అంతేకాకుండా పలువురు ప్రముఖులు సైతం సోషల్ మీడియా ద్వారా త్రినాధరావు నక్కిన తండ్రికి సంతాపం తెలుపుతున్నారు. ప్రియతమా నీవచట కుశలమా అనే సినిమాతో డైరెక్టర్ గా మారాడు త్రినాధరావు నక్కిన. ఈ సినిమా తరువాత మేము వయసుకు వచ్చాం, నువ్విలా నేనిలా అనే సినిమాలు చేశాడు. ఇక 2015 లో రాజ్ తరుణ్ హీరోగా సినిమా చూపిస్తా మావా అనే సినిమా చేశాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ డైరెక్టర్ దశ మారింది.

Also Read: Rajamouli: ఆ డైరెక్టర్ ను ముసుగేసి కొడితే పదివేలు ఇస్తా..
ఇక నానితో నేను లోకల్, రామ్ తో హలో గురు ప్రేమ కోసమే, రవితేజతో ధమాకా లాంటి సినిమాలు చేశాడు. ధమాకా మంచి హిట్ అందుకోవడంతో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో త్రినాధరావు నక్కిన కూడా చేరాడు. ప్రస్తుతం సందీప్ కిషన్ తో ఒక సినిమా చేస్తున్న ఆయన.. ఇంకోపక్క నిర్మాత కూడా మారి సినిమాలను నిర్మిస్తున్నాడు.