// // Upcoming Web Series Sequels| OTTలో బ్లాక్ బస్టర్​​ సిరీస్​ సీక్వెల్స్​​.. స్ట్రీమింగ్‌కి రెడీ.. ఎందులో అంటే? -->
E-Paper
Advertisement

Upcoming Web Series Sequels: OTTలో బ్లాక్ బస్టర్​​ సిరీస్​ సీక్వెల్స్​​.. స్ట్రీమింగ్‌కి రెడీ.. ఎందులో అంటే?

Upcoming Web Series Sequels: OTTలో బ్లాక్ బస్టర్​​ సిరీస్​ సీక్వెల్స్​​.. స్ట్రీమింగ్‌కి రెడీ.. ఎందులో అంటే?
Advertisement

upcoming ott release web series

Upcoming Web Series Sequels(Entertainment news today): ప్రస్తుతం థియేటర్ల కంటే ఓటీటీలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. భాషతో సంబంధం లేకుండా సినీ ప్రియులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఓటీటీ సంస్థలు కూడా యూజర్స్‌ను అట్రాక్ట్ చేసుకునేందుకు పలు డిఫరెంట్ సిరీస్‌లను తీసుకొస్తున్నాయి.

Advertisement

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లో అద్భుతమైన కథలతో సిరీస్‌లను చిత్రీకరించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాయి ఓటీటీ సంస్థలు, అందువల్లనే వాటికి ఆదరణ బాగా పెరిగింది. అయితే ఓటీటీలో ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుని బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సినిమాలు, సిరీస్‌లు ఇప్పుడు సీక్వెల్స్‌తో రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ది ఫ్యామిలీ మ్యాన్:

Advertisement

ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌పై ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ ఉంది. ఈ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నుంచి రానున్న ప్రతీ సినిమా, సిరీస్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అయితే ఈ ఓటీటీలో సూపర్ రెస్పాన్స్‌తో అత్యధిక వ్యూస్ సంపాదించుకున్న సిరీస్‌ల్లో ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఒకటి. ఈ సిరీస్‌ గతంలో స్ట్రీమింగ్‌కు వచ్చి అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది.

READ MORE: ఈ రోజు తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే..

ఇక ఇప్పుడు ఈ సిరీస్‌కు సీక్వెల్ రూపొందింది. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి లీడ్ రోల్స్ చేసిన ఈ సిరీస్‌కి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. అయితే సీజన్2 లో సమంత నటించి మెప్పించింది. కాగా ఇప్పుడు సీజన్ 3 ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. త్వరలో ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు రానుంది.

మీర్జాపూర్:

అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ సిరీస్ ఒక సంచలనం సృష్టించింది. కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఓటీటీలో రికార్డు క్రియేట్ చేసింది. ఈ సిరీస్ నుంచి రెండు సీజన్‌లు ఆడియన్స్ ముందుకు వచ్చి బంపర్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నాయి.

అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, విక్రాంత్ మస్సే, దివ్యేందు వంటి నటులు ప్రధాన పాత్రలు పోషించి సిరీస్‌కు వెన్నెతెచ్చారు. ఇక ఇప్పుడు ఈ సిరీస్‌కు సీజన్ 3 రూపొందుతోంది. తాజాగా ఈ సీజన్ 3 షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. దీంతో త్వరలోనే ఈ సిరీస్ సీక్వెల్ ఓటీటీ ఆడియన్స్ ముందుకు రానుంది.

READ MORE: రెండు ఓటీటీలలో రవితేజ ‘ఈగల్’.. అఫీషియల్ డేట్ వచ్చేసింది..

పంచాయత్:

దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించిన కామెడీ డ్రామా సిరీస్ ‘పంచాయత్’. ఈ సిరీస్‌ దర్శకుడు దీపక్‌కి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన రెండు సీజన్లు ఓటీటీ ఆడియన్స్‌ను బాగా అలరించాయి. ఇప్పుడు ఈ సిరీస్‌కు 3వ సీజన్ రాబోతుంది. ఈ సీజన్ 3 వచ్చే నెల అంటే మార్చిలో ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.

బ్రీత్: ఇన్‌టూ ది షాడోస్:

అభిషేక్ బచ్చన్, నిత్యా మేనన్ కీలక పాత్ర పోషించిన సిరీస్ ‘బ్రీత్: ఇన్ టూ ది షాడోస్’. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌కు మయాంక్ శర్మ దర్శకత్వం వహించారు. కిడ్నాప్‌కు గురైన తన కుమార్తెను కాపాడుకోవడానికి ఓ వ్యక్తి ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు.

కిడ్నాపర్స్ డిమాండ్ ఏంటి అనే నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. కాగా ఈ సిరీస్ నుంచి వచ్చిన రెండు సీజన్లు మంచి రెస్పాన్స్‌ను అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ సిరీస్ నుంచి 3వ సీజన్ త్వరలో ఆడియాన్స్ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

READ MORE: రాడిసన్ డ్రగ్స్ కేసు.. పరారీలో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్!

ఆశ్రమ్:

అలాగే బాలీవుడ్ యాక్టర్ బాబీ డివోల్ నటించిన ఆశ్రమ్ సిరీస్ కూడా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఈ సిరీస్ నుంచి వచ్చిన మూడు సిరీస్‌లు సక్సెస్‌ఫుల్‌ విజయాన్ని సాధించాయి. ఇప్పుడు నాలుగో సీజన్ ఆడియాన్స్ ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ ఏడాది ఆఖరులో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

మహారాణి:

మహారాణి సిరీస్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్‌కి కరణ్ శర్మ దర్శకత్వం వహించారు. అలాగే రెండవ సీజన్‌కు రవీంద్ర గౌతమ్ దర్శకత్వం వహించారు. ఇక ఇప్పుడు మూడో సీజన్ రాబోతుంది. ఈ 3 సీజన్‌కు సౌరభ్ భావే దర్శకత్వం వహిస్తుండగా.. ఇది మార్చి 7 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఇందులో హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రలో నటించారు.

అలాగే టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, రానా నటించిన ‘రానా నాయుడు’ సీజన్ 2 ఇప్పుడు రూపొందుతోంది. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది చివర్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

READ MORE: సమంతాకు 23 ఏళ్లు, అదెలాగో మీరు కూడా తెలుసుకోండిలా..

దీంతోపాటు కాలాపానీ సీజన్ 2 త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. అలాగే టాలీవుడ్ హీరో నాగచైతన్య నటించిన దూత సిరీస్‌కు ఇప్పుడు సీక్వెల్ రూపొందుతోంది. ఈ సీక్వెల్ ఈ ఏడాదిలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఫర్జీ సీజన్ 2 కూడా ఈ ఏడాది చివర్‌లో అమెజాన్ ప్రైమ్‌లోకి రానున్నట్లు సమాచారం.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×