// // Injustice was done to sri satya: టిల్లు స్క్వేర్ లో శ్రీ సత్య సీన్స్ డిలీట్ -->
E-Paper
Advertisement

Sri Satya: మొన్న బజ్జీల పాప.. నేడు బిగ్ బాస్ పాప.. ఎంతమందికి అన్యాయం చేస్తారు

Sri Satya: మొన్న బజ్జీల పాప.. నేడు బిగ్ బాస్ పాప.. ఎంతమందికి అన్యాయం చేస్తారు
Advertisement

Sri Satya: సినిమాలో కనిపించాలంటే కష్టం ఒక్కటే కాదు అదృష్టం కూడా ఉండాలని చాలామంది చెప్పుకొస్తారు. అది కొన్నిసార్లు నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు స్టార్స్ గా వెలుగొందుతున్నవారు.. కెరీర్ మొదట్లో స్టార్ హీరో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినవారే. ఆ సినిమాలో తమ సీన్స్ ఉంచుతారో.. లేదో అని భయపడేవారు కూడా లేకపోలేదు. సినిమాలో ఎడిటింగ్ చాలా ముఖ్యం. రన్ టైమ్ ఇంకా ముఖ్యం. అనవసరమైన సీన్స్ నో, ఒకవేళ అవసరమైన సీన్స్ ఉన్నా కూడా టైమ్ లేక కట్ చేస్తూ ఉంటారు. దానివలన ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీకి కనిపించకుండానే పోతున్నారు.

Advertisement

ప్రస్తుతం ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే.. స్టార్ హీరో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి.. సినిమా రిలీజ్ అవ్వకముందే ఆ స్టార్ హీరో సినిమాలో మేము నటిస్తున్నామని చెప్పుకొని.. సినిమా రిలీజ్ అయ్యాక అందులో వారు కనిపించకపోయేసరికి తమకు అన్యాయం జరిగిందని ఎంతోమంది చెప్పుకొచ్చారు. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ శ్రీసత్యకు ఇలాంటి అన్యాయమే జరిగింది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను ప్రారంభించిన శ్రీ సత్య.. వెబ్ సిరీస్, సీరియల్స్ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ కు వెళ్లి బాగానే ఫేమస్ అయ్యింది. హౌస్ నుంచి బయటికి వచ్చాక మంచి అవకాశాలనే అందుకుంటుంది అనుకున్నారు. కానీ, అమ్మడు మాత్రం బుల్లితెరకే పరిమితమయ్యింది. ఇక ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో టిల్లు స్క్వేర్ లో తాను ఒక కీలక పాత్ర చేస్తున్నాను అని, సిద్దు పక్కన నటించడం ఆనందం అని చెప్పుకొచ్చింది. దీంతో టిల్లుతో అమ్మడి లైఫ్ మారిపోతుందని అనుకున్నారు. తీరా సినిమా చూస్తే .. ఒక్క సీన్ కాదు కాదు.. ఒక్క షాట్ లో మాత్రం కనిపించింది. అది కూడా రాధికా సాంగ్ లో గ్రూప్ డ్యాన్సర్ల మధ్యన.. ఇంటర్వ్యూలో ఆమె చెప్పినదానికి, సినిమాలో ఉన్నదానికి చూస్తే .. అమ్మడి సీన్స్ అన్ని కట్ చేశారు అని తెలుస్తోంది. దీంతో శ్రీ సత్య పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరి అయిపోయాయి.

ఇక శ్రీ సత్య మాత్రమే కాదు. అంతకు ముందు కుషిత కూడా ఇదే పరిస్టితిని ఎదుర్కొంది. బజ్జీల పాపగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. గుంటూరు కారం చిత్రంలో ఒక పాత్ర చేస్తున్నాను అని సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. ఆ తరువాత సినిమాలో ఈ చిన్నది కనిపించింది కూడా లేదు. ఆమె సీన్స్ కూడా ఎడిటింగ్ లో లేపేశారు. దీంతో ఆమె ఆశలు కూడా అడియాశలు అయ్యాయి. ఇలా పాపం ఈ ముద్దుగుమ్మలు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నాం అని చెప్పుకొని కొంతవరకు అవకాశాలు అందుకోవాలని ప్రయత్నించినా.. సినిమాలో లేకపోవడంతో వారు అన్యాయం అయిపోతున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×