// // Sundeep Kishan Majaka: తమ్ముళ్లు ఈ సంక్రాంతికి సీట్లు లెగుస్తాయి - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Sundeep Kishan Majaka: తమ్ముళ్లు ఈ సంక్రాంతికి సీట్లు లెగుస్తాయి

Sundeep Kishan Majaka: తమ్ముళ్లు ఈ సంక్రాంతికి సీట్లు లెగుస్తాయి
Advertisement

Sundeep Kishan Majaka: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో సినిమా అంటే కేవలం వినోదం అనే నమ్మే దర్శకుడు త్రినాధరావు నక్కిన ఒకరు. సినిమా చూపిస్తా మామ, మేం వయసుకు వచ్చాం, నేను లోకల్, ధమాకా వంటి సినిమాలతో తనకంటూ దర్శకుడుగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు త్రినాధరావు. త్రినాధరావు సినిమాలకి మంచి సక్సెస్ రేట్ ఉంది అని చెప్పాలి. మామూలుగా కొందరు దర్శకులు తీసిన సినిమాలు డిజాస్టర్లు కూడా అవుతుంటాయి. అలా ఒక డిజాస్టర్ కూడా లేకుండా కనీసం యావరేజ్ సినిమా అయినా తీస్తాడు త్రినాధ రావు. ఇకపోతే ఒక దర్శకుడికి బీభత్సమైన గుర్తింపు తీసుకొచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి. అలా త్రినాధ రావు విషయానికి వస్తే ధమాకా సినిమా మంచి లాభాలను తీసుకొచ్చి 100 కోట్లు కలెక్షన్స్ తీసుకొచ్చింది.

సంక్రాంతికి సీట్లు లెగుస్తాయి

Advertisement

బెజవాడ ప్రసన్న కుమార్, త్రినాధరావు మధ్య మంచి బాండింగ్ ఉంది. వీరిద్దరూ చేసిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇక ప్రస్తుతం వీరిద్దరూ కలిసి సందీప్ కిషన్ హీరోగా మజాకా అనే సినిమాను చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఒక పోస్టర్ రిలీజ్ చేసి సంక్రాంతికి సీట్లు లెగుస్తాయి తమ్ముళ్లు అంటూ అనౌన్స్ చేశారు. ఇక ఈ దర్శకుడు ధమాకా సినిమా రిలీజ్ కంటే ముందు తమ్ముళ్లు నేను ఆల్రెడీ ఒక బస్తాడు పేపర్లు చెప్పి ఉంచా అని ఆ సినిమా విషయంలో చెప్పారు. అప్పుడు ఆ వీడియో చాలా వైరల్ గా మారింది. చాలామంది ఏమైనా చెప్పాలనుకున్న కూడా తమ్ముళ్లు అంటూ మాట్లాడటం మొదలుపెట్టారు అప్పట్లో.

Sundeep

Advertisement

కంప్లీట్ ఎంటర్టైన్మెంట్

ఈ సినిమా గురించి రిలీజ్ చేసిన పోస్టర్ విషయానికి వస్తే. వైట్ పంచెతో అలానే వైట్ షర్ట్ ధరించి ఒక పాత టేప్ రికార్డర్ తో పోస్టర్లో దర్శనం ఇచ్చాడు సందీప్ కిషన్. పోస్టర్ లో అనేక మంగళ వాయిద్యాలతో పాటు, కొన్ని రకాల పిండి వంటలు, పండ్లు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకి మజాకా అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ చాలా క్యాచీగా అనిపిస్తుంది. ఈ సినిమా కూడా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇక సందీప్ కిషన్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే ఈ సినిమాతో పాటు స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వంలో వైబ్ అనే ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

ముందుగా ఎన్నో విలక్షణమైన పాత్రలలో కనిపించి ఆ తర్వాత హీరోగా కూడా ప్రూవ్ చేసుకున్నాడు సందీప్. రీసెంట్ గా ధనుష్ స్వీయ దర్శకత్వం వహించిన రాయాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు సందీప్ కిషన్. ఈ పాత్ర సందీప్ కిషన్ కి మంచి ప్లస్ అయింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మరోవైపు తమిళ్లో కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ, అలానే కొత్త దర్శకులును కూడా పరిచయం చేయటంలో సందీప్ కిషన్ ఎప్పుడు ముందుంటాడని చెప్పాలి. ఇక ప్రస్తుతం సందీప్ చేస్తున్న మజాకా సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే అప్పుడు పరిణామాలు బట్టి సంక్రాంతికి ఆ సినిమా వస్తుందా లేదా అనేది త్వరలో తెలియనుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×