// // Samantha: "అది బాగుంటేనే జీవిత భాగస్వామి తోడుంటారు".. వాలెంటైన్స్ డే వేళ సామ్ కామెంట్స్ వైరల్..! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Samantha: “అది బాగుంటేనే జీవిత భాగస్వామి తోడుంటారు”.. వాలెంటైన్స్ డే వేళ సామ్ కామెంట్స్ వైరల్..!

Samantha: “అది బాగుంటేనే జీవిత భాగస్వామి తోడుంటారు”.. వాలెంటైన్స్ డే వేళ సామ్ కామెంట్స్ వైరల్..!
Advertisement

Samantha..ప్రముఖ హీరోయిన్ సమంత రూత్ ప్రభ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుని ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా మారింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకునే ఈ ముద్దుగుమ్మ తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా భాగస్వామిని మెప్పించాలంటే మనలో ఏముండాలి అనే విషయాన్ని చెప్పొకొచ్చింది.

ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు – సమంత

Advertisement

ఇక సమంత గత కొంతకాలం క్రితం అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే . అయితే ఇటీవల మళ్ళీ సినిమా షూటింగ్లలో పాల్గొంటోంది.ఇక అందులో భాగంగానే ప్రస్తుతం “రక్త్ బ్రహ్మాండ్” తో పాటు “మా ఇంటి బంగారం” వంటి విభిన్నమైన కథలతో తీరిక లేకుండా గడుపుతోంది. ఇకపోతే అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే.. ఇటు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారిన సమంత.. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అంటూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది

అలా లేకపోతే భాగస్వామిని కోల్పోవాలి – సమంత

Advertisement

ఈ క్రమంలోనే సమంత మాట్లాడుతూ.. “మీరు ఒక వ్యక్తితో మంచి సంబంధాన్ని, అనుబంధాన్ని కలిగి ఉండవచ్చు. కానీ మీరు మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా లేనప్పుడు మీరు కోరుకున్న భాగస్వామికి నచ్చినట్టుగా మీరు కనిపించలేరు. ఒక వ్యక్తి పైకి అందంగా కనిపించినా .. మానసికంగా మాత్రం ప్రశాంతంగా ఉండరు. ఈ విషయాన్ని గనుక గుర్తించలేకపోతే ఏదో సమయంలో మనం మన భాగస్వామిని కోల్పోవాల్సి ఉంటుంది.ముఖ్యంగా ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడే వారికి మనం మరింత అందంగా కనిపిస్తాము తద్వారా మనల్ని వదిలి మన భాగస్వామి ఎక్కడికి వెళ్ళరు” అంటూ సమంత చెప్పుకొచ్చింది. మొత్తానికైతే తన మనసులో మాటలను చెప్పి ప్రేమికుల రోజు సందర్భంగా అందరినీ ఆశ్చర్యపరిచింది సమంత. అయితే ఇది చూసిన కొంతమంది నెటిజన్స్ మాత్రం మీ ఆరోగ్యం సహకరించకపోయినప్పుడు అండగా ఉండాల్సిన మీ భర్త మీకు దూరం అయ్యారా..? కాబట్టే మీరు ఇలా ఆలోచిస్తున్నారా? అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా సమంత చేసిన కామెంట్స్ మాత్రం ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

నాగచైతన్య – సమంత.. ప్రేమ, పెళ్లి విడాకులు..

ఇండస్ట్రీలోకి ‘ఏ మాయ చేసావే’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది సమంత(Samantha ) ఇదే సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్య (Naga Chaitanya) తో ప్రేమలో పడింది. దాదాపు ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత పెద్దలను ఒప్పించి 2017లో వివాహం చేసుకున్నారు. ముఖ్యంగా రెండు సాంప్రదాయ పద్ధతులలో వివాహం చేసుకున్న ఈ జంట నాలుగేళ్లు వైవాహిక బంధం లో సంతోషంగా గడిపారు. కానీ ఏమైందో తెలియదు కానీ గత నాలుగేళ్ల క్రితం విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక ఇప్పుడు ఎవరికి వారు తమ సినిమాలలో బిజీగా మారిన విషయం తెలిసిందే. నాగచైతన్య మాత్రం తాను ప్రేమించిన శోభిత ధూళిపాళ్ల (Shobhita dhulipala) ను వివాహం చేసుకున్నారు. ఇటీవల సాయి పల్లవి (Sai Pallavi) తో కలిసి ‘తండేల్’ సినిమా చేసి మంచి సక్సెస్ కూడా అందుకున్నారు. ఇక సమంత మాత్రం ఒంటరిగా ఉంటూనే సినిమాలపై ఫోకస్ చేసింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×