// // Allu Brothers : అల్లు బ్ర‌ద‌ర్స్‌పై ప్ర‌శ్న‌.. హీరోయిన్ అస‌హ‌నం - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Allu Brothers : అల్లు బ్ర‌ద‌ర్స్‌పై ప్ర‌శ్న‌.. హీరోయిన్ అస‌హ‌నం

Allu Brothers : అల్లు బ్ర‌ద‌ర్స్‌పై ప్ర‌శ్న‌.. హీరోయిన్ అస‌హ‌నం
Advertisement

Allu Brothers : టాలీవుడ్‌లో అల్లు బ్ర‌ద‌ర్స్‌లో అల్లు బాబీ సినిమాల‌ను నిర్మిస్తే.. అల్లు అర్జున్‌, శిరీష్ హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. ఈ ముగ్గురిలో బ‌న్నీ, శిరీష్‌లతో న‌టించి ఏకైక హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌. అమ్మ‌డు ప్రారంభంలో అవ‌కాశాల‌ను బాగానే చేజిక్కించుకుంది. అయితే క్ర‌మంగా సినిమాల్లో ఛాన్సులు త‌గ్గిపోయాయి. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా అమ్మ‌డు న‌టించిన తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా న‌వంబ‌ర్ 4న విడుదలకు సిద్ధమైంది. అల్లు శిరీష్ హీరో. రాకేష్ శశి దర్శకుడు. జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ నిర్మాణం.

ఊర్వ‌శివో రాక్ష‌సివో సినిమా ప్రమోషన్స్ రీసెంట్‌గానే స్టార్ట్ చేశారు. అందులో భాగంగా హీరోయిన్ అను ఇంటర్వ్యూ జరిగింది. ‘‘అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో న‌టించారు. ఇప్పుడు అల్లు శిరీష్‌తో ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రంలో న‌టించారు. మ‌రి వీరిద్ద‌రిలో ఎవ‌రు నాటీ.. ఎవ‌రు క్యూట్’’ అని ప్ర‌శ్నించాడో ఓ రిపోర్ట‌ర్‌. ఆ ప్ర‌శ్న అను ఇమ్మాన్యుయేల్‌కి న‌చ్చలేదు. వెంట‌నే సద‌రు రిపోర్ట‌ర్‌పై ఆమె అస‌హ‌నాన్ని ప్ర‌ద‌ర్శించింది. ‘అడ‌గ‌టానికి వేరే ప్ర‌శ్నే లేదా?’ అంటూ మండిపడింది. త‌నేం అంత‌లా కానీ ప్ర‌శ్నేం వేయ‌లేదే అని స‌ద‌రు రిపోర్ట‌ర్ ముందు ఖంగు తిన్నాడు. అయితే త‌ర్వాత ఏమ‌నుకున్నాడో ఏమో కానీ ప్ర‌శ్న మార్చి సినిమాలో మీకు న‌చ్చిన ఎలిమెంట్ ఏంటి? అని అడిగాడు. దానికి ఆమె మాట్లాడుతూ సినిమా ఇంకా రిలీజ్ కాలేదుగా.. ఇప్పుడే చెబితే బాగోదు అని స‌మాధానం చెప్పింది.

Advertisement

ఊర్వ‌శివో రాక్ష‌సివో సినిమా విష‌యానికి వ‌స్తే.. ఇందులో ఇంట్రావ‌ర్ట్ అయిన హీరో.. ఎక్స్‌ట్రావ‌ర్ట్ అయిన హీరోయిన్ మ‌ధ్య ప్రేమ పుడుతుంది. ఇద్ద‌రు సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్స్‌. హీరోయిన్ పోజిష‌న్ ఎక్కువ‌. ఇద్ద‌రు క‌లిసి లివ్ ఇన్ రిలేష‌న్ చేస్తారు. చివ‌ర‌కు హీరోకి హీరోయిన్ బ్రేక‌ప్ అనేసి జ‌రిగిందంతా మ‌రిచిపోమ్మ‌ని అంటుంది. కానీ హీరోయిన్‌తో పీక‌ల లోతు ప్రేమ‌లో మునిగిన హీరో త‌ర్వాత ఏం చేశాడ‌నేదే సినిమా క‌థాంశం. బ్రేక్ కోసం చాన్నాళ్లుగా వెయిట్ చేస్తోన్న అల్లు శిరీష్‌కి ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×