// // Panchathantram Trailer: 5 జంటల జీవన ప్రయాణం ‘పంచతంత్రం’… ట్రైలర్ విడుదల - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Panchathantram Trailer: 5 జంటల జీవన ప్రయాణం ‘పంచతంత్రం’… ట్రైలర్ విడుదల

Panchathantram Trailer: 5 జంటల జీవన ప్రయాణం ‘పంచతంత్రం’… ట్రైలర్ విడుదల
Advertisement

Panchathantram Trailer : డా.బ్ర‌హ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్ర ఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్ప‌ల త‌దిత‌రులు న‌టిస్తోన్న యాంథాల‌జీ ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్ ప‌తాకాల‌పై అఖిలేష్ వ‌ర్ద‌న్‌, సృజ‌న్ ఎర‌బోలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హ‌ర్ష పులిపాక ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డిసెంబ‌ర్ 9న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. శ‌నివారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న విడుద‌ల చేసిన చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలియ‌జేసింది.

‘పంచతంత్రం’ ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ఇది 5 జంట‌ల‌కు సంబంధించిన క‌థ అని అర్థ‌మ‌వుతుంది. డా.బ్ర‌హ్మానందం ఈ ఐదు క‌థ‌ల‌కు పంచేద్రియాలు అనే పేరు పెట్టి త‌న కోణంలో స్టార్ట్ చేస్తార‌ని ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. సంతోషాలే కాదు.. బాధ‌లు కూడా వ‌స్తుంటాయి. అలా వ‌చ్చిన‌ప్పుడు మ‌నం వాటిని ఎలా స్వీక‌రించాం. మ‌న ప‌నుల‌ను ఎంత బాధ్య‌త‌గా పూర్తి చేస్తూ ముందుకెళ్లామ‌నేది క‌థాంశం అని క్లియ‌ర్‌గా తెలుస్తుంది. సినిమాలో మ‌న‌కు క‌నిపించ‌బోయే ఐదు జంట‌ల‌కు ఒక్కో క‌థ .. ఒక్కో ర‌క‌మైన ప్ర‌యాణం.. అవ‌న్నీ ఎలాంటి ముగింపుతో ఎండ్ అయ్యాయ‌నే ‘పంచతంత్రం’ సినిమా ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా హార్ట్ ట‌చింగ్ ఎమోష‌న్స్‌తో ముందుకు సాగుతుంది.

Advertisement

ప్ర‌తి క‌థ‌లో మ‌న చుట్టూ ఉన్న స‌మాజాన్ని అందులో వ్య‌క్తుల వ్య‌క్తిత్వాల‌ను ద‌ర్శ‌కుడు హ‌ర్ష ఎంతో అర్థ‌వంతంగా ముందుకు తీసుకెళ్లిన్న‌ట్లు తెలుస్తోంది. ఇలాంటి ఫీల్ గుడ్ యాంథాల‌జీని ద‌ర్శ‌కుడు ఎలా ట్రీట చేశార‌నే ఎగ్జ‌యిట్‌మెంట్ కూడా క‌లుగుతుంది.

అర్థ‌వంత‌మైన సంభాష‌ణ‌లు ప్ర‌తి పాత్ర‌లోని భావోద్వేగాల‌ను సెన్సిబుల్‌గా ఎలివేట్ చేస్తున్నాయి.
ప్ర‌శాంత్ ఆర్‌.విహారి సంగీతం, నేప‌థ్య సంగీతం.. రాజ్ కె.న‌ల్లి సినిమాటోగ్ర‌ఫీ స‌న్నివేశాల‌ను, వాటిలోని ఎమోష‌న్స్‌ను నెక్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి. ట్రైల‌ర్ చూస్తున్న‌ప్పుడు మ‌న‌సుకు తెలియ‌ని ఆర్ద్ర‌త క‌లుగుతుంది. సినిమాను ఎప్పుడెప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూద్దామా అనే ఆస‌క్తి పెరుగుతుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×