// // October Release Movies: అక్టోబర్లో విడుదలయ్యే చిత్రాలు.. ఇది కదా ఫ్యాన్స్ కి అసలైన దసరా..! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

October Release Movies: అక్టోబర్లో విడుదలయ్యే చిత్రాలు.. ఇది కదా ఫ్యాన్స్ కి అసలైన దసరా..!

October Release Movies: అక్టోబర్లో విడుదలయ్యే చిత్రాలు.. ఇది కదా ఫ్యాన్స్ కి అసలైన దసరా..!
Advertisement

October Release Movies.. అక్టోబర్ అనగానే దసరా పండుగ , దీపావళి గుర్తుకొస్తాయి. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ లో సెలవులు కూడా ఎక్కువే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు కూడా తమ సినిమాలను విడుదల చేయడానికి ఇదే సమయం అన్నట్టుగా సినిమాలను విడుదల చేస్తూ భారీగా ఆదాయాన్ని పొందే దిశగా అడుగులు వేస్తారు. ఇక ఈ క్రమంలోనే దసరా, దీపావళి రాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా అప్పుడే పిల్లలకు సెలవులు ప్రకటించేసాయి. ఈ సెలవులను క్యాష్ చేసుకోవడానికి అక్టోబర్ లో కొన్ని చిత్రాలు విడుదలవుతున్నాయి. మరి అక్టోబర్లో విడుదలయ్యే సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

స్వాగ్:
యంగ్ హీరో శ్రీ విష్ణు, రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం స్వాగ్ .ఈ సినిమా అక్టోబర్ 4వ తేదీన విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా.. సినిమాపై ఆద్యంతం హైప్ పెంచేసింది. 4 కాలాలకు సంబంధించిన టైం ట్రావెల్ మూవీ గా వస్తున్న ఈ సినిమాలో విష్ణు నాలుగు పాత్రలతో అదరగొట్టబోతున్నారు.

Advertisement

శ్రీశ్రీశ్రీ రాజావారు..

సతీష్ వేగేష్ణ దర్శకత్వంలో రావు రమేష్, వి.కె నరేష్, నార్నే నితిన్ కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన విడుదల కాబోతోంది.

Advertisement

వేట్టయాన్..

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ టీ.జే.జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన చిత్రం వేట్టయాన్. ఈ చిత్రం అక్టోబర్ 10వ తేదీన విడుదల కాబోతోంది.

మా నాన్న సూపర్ హీరో..

ప్రముఖ హీరో సుధీర్ బాబు హీరోగా,ఆమని, సాయిచంద్ , శశాంక్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న చిత్రం మా నాన్న సూపర్ హీరో. అభిలాష రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సునీల్ బాలుసు నిర్మిస్తున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న మా నాన్న సూపర్ హీరో అక్టోబర్ 11న విడుదల కాబోతోంది.

విశ్వం..

ప్రముఖ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో కావ్య థాపర్ హీరోయిన్ గా, గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం విశ్వం. ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కాబోతోంది. ఇందులో సునీల్, ముఖేష్ రిషి, జిషు సేన్ గుప్తా, వెన్నెల కిషోర్, వి. కె. నరేష్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.

మార్టిన్:

ధ్రువ సర్జ హీరోగా నటిస్తున్న మార్టిన్ సినిమా అక్టోబర్ 11న విడుదల కాబోతోంది. ఈ సినిమా కొన్ని కారణాల చేత వాయిదా పడబోతోంది అంటూ వార్తలు వచ్చినా ఎట్టకేలకు చిత్ర బృందం ప్రకటించి, ఈ మూవీపై క్లారిటీ ఇచ్చింది.

జనక అయితే గనక

సుహాస్ హీరోగా నటిస్తున్న జనక అయితే గనకా సినిమా అక్టోబర్ 12 వ తేదీన విడుదల కాపోతోంది. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మురళీ శర్మ, ఆచార్య శ్రీకాంత్, గోపరాజు రమణ, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. బడా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంగీర్థన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది.

బచ్చల మల్లి ..

ప్రముఖ సీనియర్ హీరో అల్లరి నరేష్ హీరోగా , అమృత అయ్యర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం బచ్చల మల్లి. ఇందులో హరితేజ ,రావు రమేష్, ప్రవీణ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తుండగా, సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.అక్టోబర్ 25వ తేదీన విడుదల కాబోతోంది.

అమరన్..

మేజర్ ముకుంద్ బయోపిక్ ఆధారంగా వస్తున్న అమరన్ సినిమా అక్టోబర్ 31న విడుదల కాబోతుంది. ఇందులో శివ కార్తికేయన్ మేజర్ ముకుంద్ పాత్ర పోషించగా.. ఆయన భార్య ఇందు పాత్రలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నటిస్తోంది..

లక్కీ భాస్కర్..
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ అక్టోబర్ 31న విడుదల కాబోతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా , శ్రీకరా స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, ఆయేషా ఖాన్ , హైపర్ ఆది, పి..సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మెకానిక్ రాఖీ..

విశ్వక్ సేన్ హీరోగా.. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వం వహించిన చిత్రం మెకానిక్ రాఖీ..ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి , శ్రద్ధా శ్రీనాథ్ క్రీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 31న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల చేత విడుదల వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రామ్‌నగర్ బన్నీ..

బుల్లితెర మెగా స్టార్ గా పేరు తెచ్చుకున్న సీరియల్ యాక్టర్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ రామ్ నగర్ బన్నీ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో చంద్రహాస్ సరసన ఏకంగా నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. రీతు మంత్ర, విస్మ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి ఇలా నలుగురు నటిస్తూ ఉండడం గమనార్హం. ఈ చిత్రానికి శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహిస్తున్నారు.

వీటితోపాటు..

రోటీ కపడా రొమాన్స్ :అక్టోబర్ 04 ,2024, దక్షిణ : అక్టోబర్ 04 ,2024
జీబ్రా : అక్టోబర్ 31, 2024
ఉపేంద్ర యూఐ : అక్టోబర్ 2024 ..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×