// // Meenakshi Chaudhary: బంగారు హుండీని చిల్లరకు వాడుతున్నారు కదరా.. ఇప్పుడైనా లక్ కలిసి వచ్చేనా.. ? -->
E-Paper
Advertisement

Meenakshi Chaudhary: బంగారు హుండీని చిల్లరకు వాడుతున్నారు కదరా.. ఇప్పుడైనా లక్ కలిసి వచ్చేనా.. ?

Meenakshi Chaudhary: బంగారు హుండీని చిల్లరకు వాడుతున్నారు కదరా.. ఇప్పుడైనా లక్ కలిసి వచ్చేనా.. ?
Advertisement

Meenakshi Chaudhary:  సినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడకు ఎంత కష్టపడి వచ్చినా సక్సెస్ అందాలి అంటే వారి నిబద్దత, హార్డ్ వర్క్, లక్ అన్ని కలిసిరావాలి.  ఒక్క సినిమాతోనే స్టార్ గా మారినవారు  ఉన్నారు. ఎన్ని సినిమాలు చేసినా ఇంకా గుర్తింపు రానివారు కూడా ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయానికొస్తే.. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నవారు చాలామంది ఉన్నారు. అలా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారాలని ప్రయత్నిస్తున్న హీరోయిన్ మీనాక్షీ చౌదరి.

మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈ చిన్నది.. తెలుగులో  ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో  ఎంట్రీ ఇచ్చింది. సుశాంత్ హీరోగా నటించిన  ఈ చిత్రం భారీ విజయాన్ని అందించలేకపోయినా.. అమ్మడి అందాన్నీ  టాలీవుడ్ కు పరిచయం చేసింది.  కలువరేకుల్లాంటి కళ్లు.. ఎవరినైనా మతిపోగోట్టించే అందంతో మీనాక్షీ.. టాలీవుడ్ డైరెక్టర్స్ కంట త్వరగానే పడింది. ఇక రెండో సినిమానే రవితేజనటించే ఛాన్స్ పట్టేసింది. ఖిలాడీ చిత్రంలో రవితేజతో అమ్మడి రొమాన్స్ మాములుగా  ఉండదు.

Advertisement

అయితే..  ఎంత గ్లామర్ చూపించినా.. మీనాక్షీ  హిట్ మాత్రం దక్కలేదు. అయినా ఈ చిన్నది కంగారు పడకుండా  అడుగులు వేస్తూనే వచ్చింది. అందం, అభినయం ఉన్న ఈ భామ  ఆ తరువాత హిట్ 2 లో నటించింది. ఈ సినిమా కొద్దోగొప్పో విజయాన్ని అందుకున్నా.. ఆ హిట్ అమ్మడి ఖాతాలో లేకుండా పోయింది. అప్పటికే మీనాక్షీకి తెలుగులో ఫ్యాన్స్  స్టార్ట్ అయ్యారు.  ఇక ఎప్పుడైతే మీనాక్షీ.. త్రివిక్రమ్ కంట్లో పడిందో.. అమ్మడి రేంజ్ మారిపోయింది.  మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం సినిమాలో ఈ చిన్నదానికి ఛాన్స్ వచ్చింది.  అయితే సెకండ్ హీరోయిన్ గా ఆమెకు అంత ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించేసరికి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

Yash: సీతగా సాయిపల్లవి.. అందుకే రావణుడుగా చేశా

Advertisement

నిజం చెప్పాలంటే  ఈ సినిమాలో శ్రీలీల కంటే మీనాక్షీకే మంచి గుర్తింపు వచ్చింది. ఎన్ని సినిమాలు చేసినా ఈ బీయూటీకి మాత్రం ఆశించిన విజయం దక్కడం లేదు. అయితేనేం వరుస అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి. కానీ,  స్టార్ హీరోలసరసన ఈ చిన్నదానికి ఛాన్స్ దక్కడం లేదు.  ప్రస్తుతం మీనాక్షీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. దుల్కర్ సల్మాన్  లక్కీ భాస్కర్, విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ,  వరుణ్ తేజ్ మట్కా. మూడు తెలుగు సినిమాలే..  ఈ మూడు సినిమాలు మూడు వారాల గ్యాప్ లోనే రిలీజ్ కానున్నాయి.

అమ్మడు స్టార్ ను చేసే సినిమాలు అంటే ప్రస్తుతం ఇవే అని చెప్పాలి.  ఈ మూడు సినిమాలలో ఆమెకు ప్రాధాన్యత  ఉన్న పాత్ర అంటే లక్కీ భాస్కర్ అని తెలుస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 31 న రిలీజ్ కానుంది. ఇందులో ఒక గృహిణిగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్.. సినిమాపై మంచి హైప్ నే క్రియేట్ చేశాయి. ఇక ఇది మిస్ అయ్యింది అంటే.. నెక్స్ట్  మట్కా.  వరుణ్ తేజ్  హీరోగా  నటించిన ఈ సినిమా నవంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Siva Rama Krishna: ప్రభుత్వ స్థలం కబ్జా.. టాలీవుడ్ నిర్మాత అరెస్ట్

బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా ఈ చిన్నదాని పాత్ర కీలకమే  అని తెలుస్తోంది. లేదు ఇది  కూడా మిస్ అయ్యింది అంటే .. నవంబర్ 21 న మెకానిక్  రాకీ వస్తున్నాడు. విశ్వక్ సరసన మొదటి సారి  మంచి లవ్ స్టోరీతో మీనాక్షీ  రాబోతుంది. ఈ మూడు సినిమాలే  ఈ ఏడాదిలో ఈ చిన్నదాన్ని స్టార్ ను చేయగలవు. ఇవి హిట్ అయితేనే అమ్మడికి స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు వస్తాయి. మరి ఈ బంగారు హుండీని చిల్లరకు వాడకుండా.. ఏ డైరెక్టర్ మంచిగా వాడతాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×