// // Ramajogayya Sastri : దేవరలో ఇప్పటిదాకా నిప్పురవ్వనే చూశారు..బ్లాస్టర్ చూడబోతున్నారంటున్న రామజోగయ్య -->
E-Paper
Advertisement

Ramajogayya Sastri : దేవరలో ఇప్పటిదాకా నిప్పురవ్వనే చూశారు..బ్లాస్టర్ చూడబోతున్నారంటున్న రామజోగయ్య

Ramajogayya Sastri : దేవరలో ఇప్పటిదాకా నిప్పురవ్వనే చూశారు..బ్లాస్టర్ చూడబోతున్నారంటున్న రామజోగయ్య
Advertisement

lyric writer Ramajogayya Sastri gave hype statement about Devara third song: కల్కి మూవీ తర్వాత చిన్న సినిమాల హవానే నడుస్తోంది. రీసెంట్ గా కమిటీ కుర్రోళ్లు, ఆయ్, మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం మూవీలు మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించుకుంటున్నాయి. ఇక ఇదే నెలలో విడుదలైన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ మూవీలు రెండూ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ప్రస్తుతం అప్ కమింగ్ మూవీస్ దేవర, పుష్ప పైనే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆశలన్నీ ..ఎందుకంటే కల్కి మూవీ తర్వాత జనాన్ని థియేటర్ల వద్దకు రప్పించుకునే సినిమాలే లేవు. దీనితో సెప్టెంబర్ 27న విడుదల కాబోతున్నట్లు దేవర మూవీ నిర్మాతలు ప్రకటించేశారు. ఇప్పటిదాకా ఈ మూవీపై వచ్చిన టీజర్లు, పోస్టర్లు, పాటలు బాగుండటంతో ఈ మూవీపై ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది.

మూడో సాంగ్ పై భారీ అంచనాలు

Advertisement

జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ కావడంతో ఈ మూవీకి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ మూవీ గత కొంతకాలంగా వాయిదా పడుతుండటంతో నెగెటివ్ కామెంట్స్ జోరందుకున్నాయి. అందుకే ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చెయ్యడానికి..మూవీకి హైప్ తీసుకువచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. శనివారం రామజోగయ్య శాస్త్రి పుట్టిన రోజు సందర్భంగా దేవర మూవీనిర్మాతలు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలయిన రెండు పాటలు అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ముఖ్యంగా ఫియర్ సాంగ్ ఫీవర్ తో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఇక మూడో పాట ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూడో సాంగ్ గురించి నిర్మాతలు అద్భుతంగా వచ్చిందని.ఫ్యాన్స్ కు ఫుల్ మీల్ అందించే సాంగ్ అని అప్ డేట్ ఇవ్వగా..రామజోగయ్య శాస్త్రి మాత్రం ఇప్పటిదాకా మీరు నిప్పు రవ్వనే చూశారు. ఇక బ్లాస్టర్ అయిన మంట చూడబోతున్నారంటూ తాను రాసిన అప్ కమింగ్ సాంగ్ పై రామజోగయ్య ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్ చెప్పారు. ఆయుధ పూజ సాంగ్ మూవీకే హైలెట్ కాబోయేదిగా రాబోతోంది. మాస్ బీట్ సాంగ్ మామూలుగా ఉండదంటూ నిర్మాతలు కూడా స్టేట్ మెంట్ ఇచ్చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇక అనిరుధ్ ఈ మూవీకి చాలా డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పటికే పాటలు యూత్ నోటికి చేరుకున్నాయి.

పాన్ వరల్డ్ స్టార్ గా ఎన్టీఆర్

Advertisement

అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తొలిసారి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మూవీపై జాన్వీ చాలానే హోప్స్ పెట్టుకుంది. రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీతో ఒక్కసారిగా ఎన్టీఆర్ పాన్ వరల్డ్ స్టార్ గా సుపరిచితుడయ్యాడు. బాలీవుడ్ లోనూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఈ మధ్యకాలంలో బాగానే పెరిగిపోయింది. దాంతో దేవర మూవీ పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ తీసుకువస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ పూర్తయిందని సమాచారం. బయ్యర్లు ఫ్యాన్సీ రేటుకు అధిక మొత్తం చెల్లించారని తెలిసింది. ఆచార్య తర్వాత కొరటాల బాగా గ్యాప్ తీసుకుని చేస్తున్నారు ఈ మూవీని. ఆచార్యకు ముందు కెరటాలకు అపజయమే లేదు. ఇప్పుడు దేవర బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం ద్వారా తన కెరీర్ గ్రాఫ్ ను కూడా పెంచుకోవాలని కొరటాల భావిస్తున్నారట. శనివారం ఆగస్టు 24 రామజోగయ్య శాస్త్రి పుట్టినరోజుతో సహా తన కుమారుడి ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కూడా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులంతా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. రామజోగయ్య శాస్త్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు సైతం అందజేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×