Kissik Talks Show: సోషల్ మీడియా ప్రపంచంలో ఒకే ఒక్క డైలాగ్ లేదా ఒకే ఒక్క రీల్‌తో ఓవర్‌నైట్ స్టార్స్ అయిపోయిన వాళ్ళు ఎందరో . కానీ, అమెరికాలోని మంచు కురిసే వీధుల నుండి ‘డల్లాస్‌పురం యూత్’ అంటూ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఏకైక సోషల్ మీడియా సెన్సేషన్ ‘స్నో అక్క’ అలియాస్ మౌనిష (Mounisha). తాజాగా ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ బిగ్ టీవీ ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘కిసిక్ టాక్స్’ (Kissik Talks Show) లో మౌనిష సందడి చేసింది. దీనికి సంబంధించిన సరికొత్త ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. హోస్ట్ అడిగిన క్రేజీ ప్రశ్నలకు మౌనిష తనదైన యూనిక్ స్టైల్‌లో ఇచ్చిన ఆన్సర్స్ నవ్వులు పూయిస్తున్నాయి.
అనుష్క, సమంతల మిక్సింగ్.. ఇంత అందం ఎట్లా
ఇంటర్వ్యూ ప్రారంభంలోనే హోస్ట్ మౌనిషపై పొగడ్తల వర్షం కురిపించారు. “అసలు ఈ యాంగిల్ లో చూస్తే అనుష్క.. ఆ యాంగిల్ లో చూస్తే సమంత.. ఇట్లా స్ట్రైట్ గా చూస్తే అసలు వాళ్ళని మించిపోయిన అందాల ఆడబొమ్మ మౌనిషా కనిపిస్తుంది. అసలు ఇంత అందం ఎట్లా అండి మీకు?” అని అడగ్గా.. “ఇప్పుడు కామెంట్స్ లో చెప్తారండి మీరు ఇంత పొగిడాక నా సంగతి” అంటూ మౌనిష అల్టిమేట్ కౌంటర్ ఇచ్చింది. యూఎస్ నుండి హైదరాబాద్‌లోని స్టూడియోలో అడుగుపెట్టిన మౌనిష కోసం హోస్ట్ ప్రత్యేకంగా స్నో సెటప్స్ అమర్చానని వర్ష అంటే . “నేను ఎక్కడుంటే అక్కడ స్నో తీసుకొని వస్తా.. అందుకే వాతావరణం చల్లబడింది” అంటూ సరదాగా ఆటపట్టించారు మౌనిష.
ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టిన ఆ ఫేమస్ ‘స్నో రీల్’ ఎలా పుట్టిందో మౌనిష ఈ షోలో బయటపెట్టింది. అదంతా ఒక హఠాత్తు పరిణామం అని చెప్తూ.. “నిజానికి ఆ రోజు కార్‌లో మామూలుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా, పక్కనే ట్రైపాడ్ ఉంది. సరే, అక్కడెక్కడో టెక్సాస్‌లో స్నో పడిందంట కదా.. అని ఊరికే రాండమ్‌గా ఒక రీల్ చేశా. అంతే తప్ప దాని వెనుక ఎలాంటి ప్లానింగ్ లేదు. అది ఎందుకు అంతలా వైరల్ అయింది అనేది నాకు ఈ రోజు వరకు జెన్యూన్‌గా తెలియదు.
Also read: పవన్ ‘ఓజీ’, చరణ్ ‘బ్రూస్ లీ’ కెమెరామెన్‌కు సీఎం విజయ్ బంపర్ గిఫ్ట్.. అసలు మ్యాటర్ ఇదా!
బహుశా ఒక్కొక్కరికి ఒక టైం వస్తుంది అంటారు కదా.. అలా నా టైం వచ్చింది అంతే” అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత హోస్ట్ రిక్వెస్ట్ మేరకు లైవ్‌లోనే తన ఐకానిక్ డైలాగ్.. “అక్కడెక్కడో టెక్సాస్ లో స్నో పడిందంట.. ఇంక మన డల్లాస్ పురం యూత్ అందరూ అందాల ఆడబొమ్మ.. ఇది యూటా మాకు ఇక్కడ రోజు స్నో పడతది” అంటూ చేసి చూపించి అలరించింది.
ఒంగోలు, కర్నూలు, తెలంగాణ, గుంటూరు.. ఇదీ ‘స్నో అక్క’ స్లాంగ్ మిస్టరీ
మౌనిష మాట్లాడే విలక్షణమైన తెలుగు యాక్సెంట్ (Slang) వెనుక ఉన్న అసలు రహస్యాన్ని కూడా ఈ ఇంటర్వ్యూలో క్లియర్ చేసింది. తను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే అయినా, తన రక్తంలో అన్ని ప్రాంతాల యాక్సెంట్లు మిక్స్ అయ్యాయని తెలిపింది. “మా డాడీది ఒంగోలు, మమ్మీ వాళ్ళది కర్నూలు. నేను చదువుకున్నదంతా హైదరాబాద్ కావడంతో తెలంగాణ యాక్సెంట్ కూడా వచ్చేసింది. దీనికి తోడు గత 10 ఏళ్లుగా యూఎస్‌లో ఉంటున్నాను.
Also read:కిరణ్ అబ్బవరం చేతికి ‘కాంతార’ కనెక్షన్.. ఆ బాలీవుడ్ ప్రొడక్షన్‌లో మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్!
నేనున్న స్టేట్‌లో ఇండియన్స్ చాలా తక్కువ.. అమెరికన్స్ ఎక్కువ. దాంతో వాళ్ళతో మాట్లాడి ఒక టైప్ ఇంగ్లీష్ యాక్సెంట్ వచ్చింది. ఇక నా హస్బెండ్ వాళ్ళది గుంటూరు. ఇలా ఒంగోలు, కర్నూలు, తెలంగాణ, గుంటూరు, అమెరికా ఇవన్నీ కలిపి మిక్సీలో వేస్తే పుట్టిందే ఈ ‘స్నో అక్క స్లాంగ్’” అంటూ తన స్పీచ్ వెనుక ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌ను ఫన్నీగా వివరించింది.
తన హస్బెండ్ గుంటూరు అని మౌనిష చెప్పడంతో.. హోస్ట్ ఒక్కసారిగా షాక్ అవుతూ “మీకు పెళ్లయిందా?” అని అడిగిన ఎమోషనల్ అండ్ ఫన్నీ మూమెంట్స్ ఇంటర్వ్యూ కే హైలైట్‌గా నిలిచాయి. నవ్వులు, పంచ్‌లు, పర్సనల్ లైఫ్ ముచ్చట్లతో సాగిన విశేషాలు తెలుసుకోవాలంటే Kissik Talks Show ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే !