E-Paper
Advertisement

Harom Hara Teaser : ‘హరోం హర’ టీజర్.. అంచనాలు పెంచేస్తున్న సుధీర్ బాబు.

Harom Hara Teaser : ‘హరోం హర’ టీజర్.. అంచనాలు పెంచేస్తున్న  సుధీర్ బాబు.
Advertisement
Harom Hara Teaser

Harom Hara Teaser : ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి హీరో అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు మహేష్ బాబు. అదే ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. విభిన్నమైన పాత్రల్లో నటించి వెరైటీ కంటెంట్ సినిమాలు తీసి మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ గత కొన్ని రోజులుగా వరుస పరాజయాలతో బాధపడుతున్నాడు. రీసెంట్గా అతని నటించిన మామా మశ్చీంద్ర చిత్రం పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయినా వెంటనే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మరొక వినూత్నమైన ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు.

సుధీర్ బాబు మంచి మా సినిమా కటౌట్ కి తగిన వ్యక్తి.. బాడీ లాంగ్వేజ్.. డైలాగ్ అన్ని మాస్ కంటెంట్ సినిమాలకు బాగా సెట్ అవుతాయి. ఎప్పటినుంచో ఫాన్స్ కూడా అతను ఒక సాలిడ్ మాస్ మూవీలో నటిస్తే చూడాలి అని ఆశిస్తున్నారు. ఇన్నాళ్ళకి వాళ్ల కోరిక తీరబోతోంది అన్న విషయం సుదీర్ బాబు హీరోగా నటిస్తున్న హరోమారా మూవీ టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో ప్రామిసింగ్ గా ఉన్నా సుదీర్ బాబు మాస్ ఇమేజ్ మూవీపై అంచనాలను పెంచుతుంది.

Advertisement

ఒక మారుమూల పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక యాక్షన్ థ్రిల్లర్గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అన్న విషయం టీజర్ తో అర్థమవుతుంది. ఇందులో భారీగా చూపించిన హీరో ఎలివేషన్స్ షాట్స్.. మాస్ డైలాగ్స్.. అన్నిటికీ మించి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే బీజీయం.. మూవీపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. చేతిలో గన్ను పట్టుకున్న సుధీర్ బాబు.. పవర్ కోసం గన్ను పట్టుకున్నాను కానీ ఇది ఏదో తిరిగి నన్ను పట్టుకుంది.. వాడు సమరమే మొదలుపెడితే ఆ సంభవానికి సంతకం నాది అవుతుంది.. ఇలాంటి మాస్ పంచ్ డైలాగ్స్ తో బాగా ఎంటర్టైన్ చేశాడు.

ఇన్నాళ్లకు సుదీర్ కటౌట్ కి తగ్గ క్యారెక్టర్ చేస్తున్నాడు అని టీజర్ చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. ఒక్క టీజర్ తో అంచనాలను రేకెత్తించిన ఈ మూవీ విడుదలైన తర్వాత ఎంతవరకు పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఇక ఈ టీజర్ ను తెలుగులో ప్రభాస్ ,మలయాళం లో మమ్ముట్టి ,హిందీలో టైగర్ ష్రాఫ్, తమిళ్ లో విజయ్ సేతుపతి ,కన్నడలో కిచ్చా సందీప్ లాంచ్ చేశారు. 

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×