// // Gnanavel Raja : కంగువ సినిమాలో ఒక్క నెగటివ్ పాయింట్ లేదు - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Gnanavel Raja : కంగువ సినిమాలో ఒక్క నెగటివ్ పాయింట్ లేదు

Gnanavel Raja : కంగువ సినిమాలో ఒక్క నెగటివ్ పాయింట్ లేదు
Advertisement

Gnanavel Raja : కోలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమాల్లో కంగువ (Kanguva) ఒకటి. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఒకప్పుడు సినిమాటోగ్రాఫర్ గా కెరియర్ మొదలుపెట్టిన శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో దర్శకుడుగా కొన్ని సినిమాలు చేసినా కూడా తమిళ్లో వరుస సూపర్ హిట్ సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్గా అక్కడ పేరు సాధించాడు శివ. చివరగా రజనీకాంత్ (Rajinikanth) తీసిన అన్నత్తే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన శివ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ కూడా అదే స్థాయిలో ఉంది అని చెప్పొచ్చు.

చాలా సందర్భాల్లో నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ భారీ ఎలివేషన్లు ఇచ్చారు. ఒక సందర్భంలో నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ కంగువ పార్ట్ వన్ సినిమాతో చాలా సినిమాలు పోటీ పడొచ్చు కానీ కంగువ పార్టు 2 విషయంలో మాత్రం ఏ సినిమా పోటీకి రాదు అంటూ తెలిపారు. దీనిని బట్టి కంగువ సినిమా పైన ఆ నిర్మాతకు ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ కూడా మంచి రెస్పాన్స్ ను సాధించింది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జ్ఞానవేల్ రాజా ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా పూర్తిగా నేను చూశాను. మామూలుగా నేను ఒక సినిమా చూసినప్పుడు నెగిటివ్ పాయింట్స్ మాత్రమే దానిలోనవి మాట్లాడుతాను. కానీ ఈ సినిమా చూసిన తర్వాత సూర్యతో మాట్లాడుతుంటే ఎక్కువ ప్లస్ పాయింట్స్ గురించి చెప్తున్నాను అంటే నెగిటివ్ పాయింట్స్ అంతగా ఈ సినిమాలో నాకు పెద్దగా ఏమి కనిపించలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

ఇకపోతే ఈ సినిమాను కేవలం కొద్ది రోజులు మాత్రమే పోస్ట్ పోన్ చేశారు. మామూలుగా తెలుగు సినిమాలైతే ఒక డేట్ మిస్సయింది అంటే దాదాపు 6,7 నెలల వరకు పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటారు. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు అక్టోబర్ నుంచి సినిమా నవంబర్ కి వెళ్ళింది కేవలం ఒక నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. దీనిని బట్టి కొందరు స్పందిస్తూ సినిమా లేట్ అవ్వచ్చు కానీ సినిమా అరాచకం మాత్రం అంతే ఉంటుంది అంటూ కాన్ఫిడెన్స్ తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను కోలీవుడ్ బాహుబలి అని కూడా కొందరు నమ్ముతున్నారు. టాలీవుడ్ లో బాహుబలి సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కోలీవుడ్ నుంచి అదే స్థాయి ఇంపాక్ట్ ను కంగువ సినిమా క్రియేట్ చేస్తుంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×