// // Dunki movie : డిసెంబర్ రేస్ నుంచి తప్పుకున్న డంకీ.. తెలుగులో డౌటే.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Dunki movie : డిసెంబర్ రేస్ నుంచి తప్పుకున్న డంకీ.. తెలుగులో డౌటే..

Dunki movie : డిసెంబర్ రేస్ నుంచి తప్పుకున్న డంకీ.. తెలుగులో డౌటే..
Advertisement
Dunki movie

Dunki movie : డిసెంబర్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేయడానికి సలార్ మూవీతో ప్రభాస్ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతనికి పోటీగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ డంకీ చిత్రం కూడా విడుదల కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. డిసెంబర్ 21న డంకీ విడుదల కాబోతుంటే.. 22న ప్రభాస్ సలార్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. పోటీ సాలిడ్ గా ఉంటుంది అని నిన్న మొన్నటి వరకు తెగ చర్చలు జరిగాయి. అయితే ప్రస్తుతం షారుక్ డంకీ మూవీ కి సంబంధించిన సరికొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ రెండు చిత్రాలు మొదటి నుంచి ఒకదానితో ఒకటి పోటాపోటీగా ..పోటీ పడుతూ వస్తున్నాయి. సలార్ సెప్టెంబర్ లోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. కాస్త ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉండడంతో.. కొన్ని సీన్స్ రీ షూట్ చేయాల్సి వచ్చింది. దీంతో మూవీ పోస్ట్ పోన్ అయింది. ఈ నేపథ్యంలో చిత్రాన్ని డిసెంబర్ 22న విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారు. ఇక ఇదే టైంకి షారుక్ ఖాన్ చిత్రం కూడా విడుదలకు రెడీ అయింది. రెండు మూవీలకు సంబంధించిన ట్రైలర్స్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా మూవీస్ పై మంచి పాజిటివ్ బజ్ నెలకొల్పాయి.

Advertisement

ఈ సంవత్సరం షారుక్ నటించిన పఠాన్ ,జవాన్ చిత్రాలు

టాలీవుడ్ మార్కెట్ పై కూడా భారీ ప్రభావం చూపించాయి. ప్రస్తుతం షారుక్ మూవీస్ కి టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం షారుక్ నటిస్తున్న మూడవ చిత్రం డంకీ తెలుగు మార్కెట్ లో మంచి వసూళ్లు సాధిస్తుందని అందరూ భావించారు. దీనికి తగినట్టుగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన 24 గంటలలోని 103 మిలియన్ల వ్యూస్ రాబట్టింది.. మరోపక్క సలార్ కి కూడా 116 మిలియన్ల వ్యూస్ వచ్చాయి అనుకోండి. అంతేకాదు సలార్ అత్యధికంగా ప్రేక్షకులు చూసిన ట్రైలర్ గా రికార్డు కూడా క్రియేట్ చేసింది.

Advertisement

అయితే ప్రస్తుతం డంకీ మూవీ తెలుగు వర్షన్ కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. దీనికి ఒక కారణం థియేటర్ల సమస్య అయితే మరొక కారణం నేటివిటీకి సింక్ కాకపోవడం. ఈ మూవీకి సంబంధించిన కంటెంట్ ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన సమస్యను హై లైట్ చేస్తుంది.. కాబట్టి తెలుగు ప్రేక్షకులకు ఇది కనెక్ట్ అవ్వడం కష్టమని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే మొదట తెలుగులో రిలీజ్ చేయాలి అనుకున్న ఈ మూవీని ప్రస్తుతానికి తెలుగులో ఆపారని తెలుస్తోంది. ఎందుకంటే ఈ మూవీ తెలుగులో ఫ్లాప్ అయితే ఇప్పటివరకు షారుక్ కి ఉన్న ఇమేజ్ పై ఇంపాక్ట్ పడుతుంది. మళ్లీ తిరిగి మార్కెట్ డౌన్ అయ్యే ఆస్కారం ఉంది. అందుకే ట్రైలర్ ని తెలుగులో విడుదల చేయలేదు అని టాక్. మరి ఇంకా ఈ విషయంపై క్లారిటీ లేదు.. ఎందుకంటే లాస్ట్ మినిట్ సినీ ఇండస్ట్రీలో ఏదైనా జరిగే ఛాన్స్ ఉంటుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×