// // Director Nithilan Saminathan: 'మహారాజా' డైరెక్టర్ కు లగ్జరీ కారు గిఫ్ట్ -->
E-Paper
Advertisement

Director Nithilan Saminathan: ‘మహారాజా ‘ డైరెక్టర్ కు గిఫ్ట్ గా లగ్జరీ కారు… ఇచ్చింది విజయ్ సేతుపతి మాత్రం కాదండోయ్

Director Nithilan Saminathan: ‘మహారాజా ‘ డైరెక్టర్ కు గిఫ్ట్ గా లగ్జరీ కారు… ఇచ్చింది విజయ్ సేతుపతి మాత్రం కాదండోయ్
Advertisement

Director Nithilan Saminathan: రీసెంట్ గా ‘మహారాజా’ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న డైరెక్టర్ నితిలన్ సామినాథన్ కు తాజాగా ఓ లగ్జరీ కారు గిఫ్ట్ గా అందింది. కానీ ఆ గిఫ్ట్ ను డైరెక్టర్ కు ఇచ్చింది ‘మహారాజా’ సినిమాలో హీరోగా నటించిన విజయ్ సేతుపతి మాత్రం కాదండోయ్. మరి నితిలన్ కు గిఫ్ట్ ఇచ్చింది ఎవరో తెలుసుకుందాం పదండి.

డైరెక్టర్ కు లగ్జరీ గిఫ్ట్

Advertisement

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రను పోషించిన ‘మహారాజా’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా రిలీజై 100 రోజులు పూర్తి కావడంతో చెన్నైలో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు చిత్ర బృందం. జూన్ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు దర్శకుడు నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. ఇక థియేటర్లోనే కాదు ఓటీటీలో కూడా ఈ సినిమాకు అదిరిపోయే ఆదరణ లభించడంతో మేకర్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు. ఈ సినిమాను ది రూట్, థింక్ స్టూడియో సంయుక్తంగా నిర్మించగా, 20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ‘మహారాజ’ బాక్స్ ఆఫీస్ వద్ద 110 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇలాంటి బిగ్గెస్ట్ హిట్ ను ఇచ్చిన దర్శకుడికి మేకర్స్ గిఫ్ట్ ఇవ్వడం అనేది ఇప్పటికే ఎన్నోసార్లు సినిమా ఇండస్ట్రీలో జరిగింది. నిర్మాతలు లేదా హీరో తమకు మరచిపోలేని హిట్ ఇచ్చిన దర్శకుడిని సంతోషం కొద్దీ లేదా దర్శకుడిని మరింత ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి సర్ప్రైజ్ లు ఇస్తూ ఉంటారు. తాజాగా ‘మహారాజా’ డైరెక్టర్ విషయంలో కూడా అదే జరిగింది.  ఇక ‘మహారాజా’ 100 రోజుల ఫంక్షన్ జరుపుకున్న చిత్ర నిర్మాతలు డైరెక్టర్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘మహారాజ’ సినిమా డైరెక్టర్ నితిలన్ స్వామినాథన్ కు నిర్మాతలు బిఎండబ్ల్యూ లగ్జరీ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. విజయ్ సేతుపతి తన చేతుల మీదుగా ఈ గిఫ్ట్ ను డైరెక్టర్ కు అందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

హీరోకి మరిచిపోలేని గిఫ్ట్

Advertisement

ఈ సినిమా విజయ్ సేతుపతి కెరీర్లో 50వ మూవీగా తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. తన కుమార్తెకు జరిగిన అన్యాయానికి ఒక తండ్రి ఎలా పగ తీర్చుకున్నాడు అనేదే ఈ సినిమా స్టోరీ. డైరెక్టర్ ఈ మూవీని ఉత్కంఠ భరితంగా రూపొందించారు. అంతేకాకుండా దర్శకుడు మేకింగ్, రైటింగ్ పై విజయ్ సేతుపతి ప్రశంసల వర్షం కురిపించారు. ‘మహారాజా’ మూవీకి ఇంతటి గుర్తింపు దక్కడం వెనుక నితిలన్ శ్రమ ఎక్కువగా ఉందంటూ వందరోజుల వేడుకలో విజయ్ సేతుపతి, నిర్మాతలు సినిమా హిట్ కు క్రెడిట్ డైరెక్టర్ కి ఇచ్చేశారు. కాగా బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో విలన్ గా నటించగా, మమతా మోహన్ దాస్, అభిరామి, దివ్య భారతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుత ‘మహారాజ’ మూవీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×